BREAKING
సైబరాబాద్‌లో మూడు రోజుల పాటు ఉచిత షటిల్ సర్వీసులు అవకాశం కల్పిస్తే నిస్వార్థంగా సేవ చేస్తాం: శైలికా రెడ్డి గల్లంతైన ఆరుగురు మత్స్యకారుల కోసం ముమ్మర గాలింపు : రాష్ట్ర వ్యవసాయ, మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు భరోసా ఎన్నికల నిర్వహణపై డి.ఎస్.పి దిశానిర్దేశం .... పోలీసుల ఫ్లాగ్ మార్చ్ బ్రహ్మసముద్రం మండలం రాయలప్ప దొడ్డి గ్రామపంచాయతీలో తోడికోడల మధ్య పరస్పర పోరు. తెలుగుదేశం పార్టీ నుంచి ఒకరు, రెబల్గా ఒకరు పోటీ చేయుచున్నారు. సగరుల డిమాండ్లను సీఎం దృష్టికి తీసుకెళ్తా : ఎమ్మెల్యే గాంధీ జన్నారంలో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు జయశంకర్ పార్కులో నూతన మంచినీటి బోర్ ప్రారంభం.పార్కు అభివృద్ధికి మరింత ప్రాధాన్యత: ఎమ్మెల్యే గాంధీ కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు ప్రత్యేక పూజలు, దీపారాధనలతో ఆధ్యాత్మిక శోభ పాలసీలు, పరిపాలనలో పిల్లల గళానికి ప్రాధాన్యం ఇవ్వాలి: విజయవాడలో రాష్ట్రస్థాయి బాలల దినోత్సవ వేడుక *ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు* కార్తీక పౌర్ణమి వేళ అన్నవరంలో వైభవంగా జ్వాలాతోరణ మహోత్సవం విద్యారంగ అభివృద్ధికి మంత్రి నారా లోకేష్ గారి ప్రత్యేక ప్రాధాన్యత… క్షేత్రస్థాయిలో పర్యటించిన ఒంగోలు మేయర్ శ్రీమతి నల్లమల్లి శ్రీ శిల్ప కార్తీక పౌర్ణమి సందర్భంగా వైభవంగా పంపా హారతులు విపి రేగ ఘటనపై కిమిడి నాగార్జున దిగ్భ్రాంతి

జాతీయ మాల మహానాడు సిద్దిపేట జిల్లా నూతన కమిటీ ఏర్పాటు జిల్లా అధ్యక్షుడిగా ఆరె కిశోర్ ఎన్నిక

Select Suryaa Now
జాతీయ మాల మహానాడు సిద్దిపేట జిల్లా నూతన కమిటీ ఏర్పాటు జిల్లా అధ్యక్షుడిగా ఆరె కిశోర్ ఎన్నిక

సిద్దిపేట;జాతీయ మాల మహానాడు సిద్దిపేట జిల్లా నూతన కమిటీని ఎన్నుకొని ప్రకటించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన విస్తృతస్థాయి సమావేశంలో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటించారు.ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడిగా ఆరె కిశోర్, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా చింతల విజయ్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షులుగా జాజల చందు, మందాల బాబు, కుంభాల రమేష్, అధికార ప్రతినిధిగా ధార స్వామి నియమితులయ్యారు. అలాగే కార్యదర్శులుగా నలుమాల నవీన్, నిమ్మ నితిన్, తుక్కోజి సతీష్, ప్రచార కార్యదర్శిగా తాండ్ర నరసింహులు, కార్యనిర్వాహక కార్యదర్శిగా తలారి నరసయ్య, యువజన విభాగం కార్యదర్శిగా గుమ్మడి సాయి శ్రీరామ్ నియమితులయ్యారు.మీడియా సెల్ ఇన్‌చార్జిలుగా పుట్టరాజు, జాల శ్రీనివాస్, గౌరవ అధ్యక్షులుగా మండల యాదగిరి, గుడుమల్ల సత్తయ్యలను ఎంపిక చేశారు. నూతన కమిటీకి జిల్లా స్థాయిలో పూర్తి నిర్వహణ బాధ్యతలు చేపట్టే అధికారాలను కల్పిస్తూ నియామకాలు చేపట్టినట్లు సమావేశంలో వెల్లడించారు.ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ మాట్లాడుతూ.. నూతన కమిటీ సభ్యులు నిజాయితీ, నిబద్ధతతో పనిచేయాలని సూచించారు. జిల్లాలో ఎక్కడ మాల జాతికి అన్యాయం జరిగినా ఐక్యంగా పోరాడాలని, మాలల హక్కుల సాధనలో సిద్దిపేట జిల్లా ముందుండాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు మేడి అంజయ్య, వెన్నరాజు, బుట్టి సత్యనారాయణ, రాష్ట్ర పొలిట్‌బ్యూరో చైర్మన్ ర్యాకం శ్రీరాములు, రాష్ట్ర సాంస్కృతిక సారధి కన్వీనర్ ఎలుక దేవయ్య, దుబ్బాక నియోజకవర్గ ఇన్‌చార్జి కాల్వ నరేష్, కంబాల రవి, దుండ్ర సుమన్, సుంకే రమేష్, డ్యాగాల సతీష్, దార మల్లయ్య, బందెల గోపాల్, సాయిపరమేశ్వర్ తదితర కులబాంధవులు పాల్గొన్నారు.