BREAKING
మామిడాడ సర్పంచ్ గా సూరిబాబు రవీంద్ర భారతిలో ది మిషన్ 11వ వార్షికోత్సవ వేడుకలు కార్తీక పౌర్ణమి వేడుకల్లో ఎంపీ సురేష్ కుమార్ షెట్కర్ అభ్యర్ధుల గెలుపే లక్ష్యంగా కూటమి నాయకులు కృషి చేయాలి కార్తవీర్యార్జున స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన చినమట్లపూడి విద్యార్థులు పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో గురువుల పాత్ర కీలకం: ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ కోటనందూరు సర్పంచ్ అభ్యర్థిగా జనసేన పార్టీ తరఫున అంకమరెడ్డి రాజేష్! కాంగ్రెస్ శ్రేణులకు 60:40 నిష్పత్తిలో పదవులు.. మంత్రి శ్రీధర్‌బాబు హామీ కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయాల్లో అన్నదాన కార్యక్రమం లో ముఖ్యఅతిథిలుగా పాల్గొన్న నాయకులు వి.చంద్రారెడ్డి, పి.జైపాల్ రెడ్డి దుండిగల్‌లో ఘనంగా అయ్యప్ప స్వామి మహా పడిపూజ పేదలకు సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యం కార్తీక పౌర్ణమి వేళ కనకదుర్గమ్మ అమ్మవారి దర్శనం.. శంభీపూర్ క్రిష్ణ ప్రత్యేక పూజలు* స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో ప్రతి అంశంపై ప్రత్యేక దృష్టి సారించాలి : రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా బాల్య వివాహ ముక్త్ భారత్‌పై అవగాహన సదస్సు

బీసీల హక్కుల సాధనకు కృషి చేస్తా దేవసాని ప్రియదర్శిని

Select Suryaa Now
బీసీల హక్కుల సాధనకు కృషి చేస్తా దేవసాని ప్రియదర్శిని

హుస్నాబాద్;బీసీల సామాజిక, రాజకీయ చైతన్యంతో పాటు వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న దేవసాని ప్రియదర్శినిని బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర మహిళా అధికార ప్రతినిధిగా నియమించారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య ఆదేశాల మేరకు జాతీయ ప్రధాన కార్యదర్శి గొర్ల అయిలేశ్ యాదవ్ నియామక ఉత్తర్వులు జారీ చేశారు.ఈ సందర్భంగా దేవసాని ప్రియదర్శిని మాట్లాడుతూ తనపై నమ్మకంతో రాష్ట్ర మహిళా అధికార ప్రతినిధిగా నియమించిన జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య, జాతీయ ప్రధాన కార్యదర్శి గొర్ల అయిలేశ్ యాదవ్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే జాతీయ ఉపాధ్యక్షుడు పులవేని పోచమల్లు యాదవ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాసగోని కిరణ్, రాష్ట్ర అధికార ప్రతినిధి మేడిచల్మి నర్సింహా, ముక్కెర రాజులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.రాష్ట్రవ్యాప్తంగా బీసీల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని, బీసీలను సంఘటితం చేసి వారి హక్కుల సాధన కోసం ఉద్యమిస్తానని తెలిపారు. చట్టసభల్లో బీసీలకు తగిన రిజర్వేషన్లు కల్పించే వరకు పోరాటం కొనసాగిస్తానని దేవసాని ప్రియదర్శిని స్పష్టం చేశారు.