ఇందిరమ్మ బీమా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం..
బెజ్జంకి;తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను మండల పరిధిలోని గూడెం గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ గూడెల్లి శ్రీకాంత్ పాలకవర్గం సభ్యులతో కలిసి మంగళవారం ప్రారంభించారు.ఈ సందర్భంగా ఫోరం మండలాధ్యక్షుడు,సర్పంచ్ గూడెల్లి శ్రీకాంత్ మాట్లాడుతూ.అర్హులైన పేద,మధ్య తరగతి కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ కుటుంబ బీమా ప్రవేశపెట్టిందన్నారు.పథకం మార్గదర్శకాలకు అనుగుణంగా అర్హత కలిగినవారు బీమా పథకం కోసం అర్జీలు అందజేసి సద్వినియోగం చేసుకోవాలని శ్రీకాంత్ కోరారు.ఆధార్,రేషన్ కార్డుల ప్రకారం 18 నుంచి 59 ఏళ్లున్న వారి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు తెలిపారు.మొబైల్ నెంబర్ ఆధారంగా ఓటిపి ప్రకారం ఆన్లైన్లో దరఖాస్తుల నమోదు చేస్తున్నారు.ఉప సర్పంచు యాలాల పర్శరాములు,పంచాయతీ కార్యదర్శి మెరుగు యాదగిరి,వార్డు సభ్యులు నూనె రాములు,నారెడ్డి శ్రీనాథ్ రెడ్డి,బోనాల లక్ష్మి,అంగన్వాడి టీచర్ మంకాలి సరోజన,సీఏ కుసుంబ సుష్మ,గ్రామస్తులు పాల్గొన్నారు.