BREAKING
మామిడాడ సర్పంచ్ గా సూరిబాబు రవీంద్ర భారతిలో ది మిషన్ 11వ వార్షికోత్సవ వేడుకలు కార్తీక పౌర్ణమి వేడుకల్లో ఎంపీ సురేష్ కుమార్ షెట్కర్ అభ్యర్ధుల గెలుపే లక్ష్యంగా కూటమి నాయకులు కృషి చేయాలి కార్తవీర్యార్జున స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన చినమట్లపూడి విద్యార్థులు పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో గురువుల పాత్ర కీలకం: ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ కోటనందూరు సర్పంచ్ అభ్యర్థిగా జనసేన పార్టీ తరఫున అంకమరెడ్డి రాజేష్! కాంగ్రెస్ శ్రేణులకు 60:40 నిష్పత్తిలో పదవులు.. మంత్రి శ్రీధర్‌బాబు హామీ కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయాల్లో అన్నదాన కార్యక్రమం లో ముఖ్యఅతిథిలుగా పాల్గొన్న నాయకులు వి.చంద్రారెడ్డి, పి.జైపాల్ రెడ్డి దుండిగల్‌లో ఘనంగా అయ్యప్ప స్వామి మహా పడిపూజ పేదలకు సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యం కార్తీక పౌర్ణమి వేళ కనకదుర్గమ్మ అమ్మవారి దర్శనం.. శంభీపూర్ క్రిష్ణ ప్రత్యేక పూజలు* స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో ప్రతి అంశంపై ప్రత్యేక దృష్టి సారించాలి : రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా బాల్య వివాహ ముక్త్ భారత్‌పై అవగాహన సదస్సు

దీక్ష దివస్ చారిత్రాత్మక ఘట్టం..

Select Suryaa Now
దీక్ష దివస్ చారిత్రాత్మక ఘట్టం..

బెజ్జంకి;తెలంగాణ సాధనకు బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ చేపట్టిన అమరణ నిరాహార దీక్ష ఉద్యమ చరిత్రలో చారిత్రాత్మక ఘట్టమని  మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ పేర్కొన్నారు.ఈ నెల 29న అలుగునూర్ లో నిర్వహించనున్న దీక్ష దివస్ ను విజయవంతం చేయాలన్నారు.మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం పార్టీ మండలాధ్యక్షుడు పాకాల మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్,మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు.2009 నవంబర్ 29న కరీంనగర్ గడ్డ నుంచి ఆమరణ దీక్షకు బయలుదేరిన కేసీఆర్ తో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిందని వివరించారు.కేసిఆర్ దీక్షకు బయలుదేరిన ప్రాంతాన్ని ఉద్యమ పవిత్ర స్థలంగా భావిస్తున్నామని మాజీ ఎంపీ వినోద్ కుమార్ అన్నారు.అలుగునూర్ లో 29న జరగనున్న దీక్ష దివస్ బహిరంగ సభకు ప్రజలు,పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలిరావాలని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కోరారు.బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణారావు,నాయకులు లింగాల లక్ష్మణ్,చింతకింది శ్రీనివాస్ గుప్తా,కనగండ్ల తిరుపతి, బోయినపల్లి శ్రీనివాస్ రావు,రావుల రామకృష్ణారెడ్డి,రాజ మహేందర్ రెడ్డి,ఎల శేఖర్ బాబు,దీటి రాజు,చెలుకల తిరుపతిరెడ్డి,బిగుళ్ల దుర్గా సుదర్శన్,సర్పంచులు బొల్లం శ్రీధర్,తాళ్లపల్లి భీమయ్య,ఎర్రవెల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.