BREAKING
సైబరాబాద్‌లో మూడు రోజుల పాటు ఉచిత షటిల్ సర్వీసులు అవకాశం కల్పిస్తే నిస్వార్థంగా సేవ చేస్తాం: శైలికా రెడ్డి గల్లంతైన ఆరుగురు మత్స్యకారుల కోసం ముమ్మర గాలింపు : రాష్ట్ర వ్యవసాయ, మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు భరోసా ఎన్నికల నిర్వహణపై డి.ఎస్.పి దిశానిర్దేశం .... పోలీసుల ఫ్లాగ్ మార్చ్ బ్రహ్మసముద్రం మండలం రాయలప్ప దొడ్డి గ్రామపంచాయతీలో తోడికోడల మధ్య పరస్పర పోరు. తెలుగుదేశం పార్టీ నుంచి ఒకరు, రెబల్గా ఒకరు పోటీ చేయుచున్నారు. సగరుల డిమాండ్లను సీఎం దృష్టికి తీసుకెళ్తా : ఎమ్మెల్యే గాంధీ జన్నారంలో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు జయశంకర్ పార్కులో నూతన మంచినీటి బోర్ ప్రారంభం.పార్కు అభివృద్ధికి మరింత ప్రాధాన్యత: ఎమ్మెల్యే గాంధీ కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు ప్రత్యేక పూజలు, దీపారాధనలతో ఆధ్యాత్మిక శోభ పాలసీలు, పరిపాలనలో పిల్లల గళానికి ప్రాధాన్యం ఇవ్వాలి: విజయవాడలో రాష్ట్రస్థాయి బాలల దినోత్సవ వేడుక *ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు* కార్తీక పౌర్ణమి వేళ అన్నవరంలో వైభవంగా జ్వాలాతోరణ మహోత్సవం విద్యారంగ అభివృద్ధికి మంత్రి నారా లోకేష్ గారి ప్రత్యేక ప్రాధాన్యత… క్షేత్రస్థాయిలో పర్యటించిన ఒంగోలు మేయర్ శ్రీమతి నల్లమల్లి శ్రీ శిల్ప కార్తీక పౌర్ణమి సందర్భంగా వైభవంగా పంపా హారతులు విపి రేగ ఘటనపై కిమిడి నాగార్జున దిగ్భ్రాంతి

మానవత్వం చాటుకున్న ఎల్ఐసీ ఏజెంట్ చెరుకూరి వెంకట నారాయణ.. వృద్ధ పేద దంపతులకు నిత్యావసర సరుకుల అందజేత

Select Suryaa Now
మానవత్వం చాటుకున్న ఎల్ఐసీ ఏజెంట్ చెరుకూరి వెంకట నారాయణ.. వృద్ధ పేద దంపతులకు నిత్యావసర సరుకుల అందజేత

కనిగిరి, మేజర్‌న్యూస్‌ :

 ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడమే నిజమైన మానవత్వమని ఎల్ఐసీ ఏజెంట్ చెరుకూరి వెంకట నారాయణ చాటిచెప్పారు.

కనిగిరికి చెందిన పంచాగ్నుల వెంకట సుబ్బయ్య, జానకమ్మ అనే వృద్ధ పేద బ్రాహ్మణ దంపతులు వృద్ధాప్యం కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ, రోజువారీ అవసరాలు తీర్చుకోవడానికి సైతం అవస్థలు పడుతున్న విషయం తెలుసుకున్న చెరుకూరి వెంకట నారాయణ వెంటనే స్పందించారు.

ఈ మేరకు 25 కిలోల బియ్యం బస్తాతో పాటు కూరగాయలు, నిత్యావసర సరుకులు, పండ్లను విజేత కళాశాల కరస్పాండెంట్ పసుపులేటి అరుణోదర్, జాతీయ బ్రాహ్మణ యువజన కార్యదర్శి సంగరాజు సాయి మనోజ్‌లతో కలిసి వృద్ధ దంపతులకు అందజేశారు. అనంతరం వారిని ఆప్యాయంగా పరామర్శించి, వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా భవిష్యత్తులో కూడా వారికి మరింత సహాయం అందిస్తామని చెరుకూరి వెంకట నారాయణ భరోసా ఇచ్చారు. వృద్ధాప్యంలో కనీస అవసరాలు తీర్చుకోవడానికి ఇబ్బందులు పడుతున్న పేద దంపతులకు అండగా నిలిచి సహాయం అందించడం పట్ల పలువురు అభినందనలు వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో చీమలమర్రి రవికుమార్, రామచంద్రుని ఆదినారాయణ, వాలిచర్ల మధుసూదన్ రావు, జొన్నలగడ్డ శబరి తదితరులు పాల్గొన్నారు.

సాటి మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు స్పందించి, చేతనైన సహాయం చేయడమే నిజమైన సేవాభావమని ఈ కార్యక్రమం ద్వారా చెరుకూరి వెంకట నారాయణ నిరూపించారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజంలో మరింత మందికి స్ఫూర్తిగా నిలవాలని పలువురు ఆకాంక్షించారు.