BREAKING
సైబరాబాద్‌లో మూడు రోజుల పాటు ఉచిత షటిల్ సర్వీసులు అవకాశం కల్పిస్తే నిస్వార్థంగా సేవ చేస్తాం: శైలికా రెడ్డి గల్లంతైన ఆరుగురు మత్స్యకారుల కోసం ముమ్మర గాలింపు : రాష్ట్ర వ్యవసాయ, మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు భరోసా ఎన్నికల నిర్వహణపై డి.ఎస్.పి దిశానిర్దేశం .... పోలీసుల ఫ్లాగ్ మార్చ్ బ్రహ్మసముద్రం మండలం రాయలప్ప దొడ్డి గ్రామపంచాయతీలో తోడికోడల మధ్య పరస్పర పోరు. తెలుగుదేశం పార్టీ నుంచి ఒకరు, రెబల్గా ఒకరు పోటీ చేయుచున్నారు. సగరుల డిమాండ్లను సీఎం దృష్టికి తీసుకెళ్తా : ఎమ్మెల్యే గాంధీ జన్నారంలో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు జయశంకర్ పార్కులో నూతన మంచినీటి బోర్ ప్రారంభం.పార్కు అభివృద్ధికి మరింత ప్రాధాన్యత: ఎమ్మెల్యే గాంధీ కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు ప్రత్యేక పూజలు, దీపారాధనలతో ఆధ్యాత్మిక శోభ పాలసీలు, పరిపాలనలో పిల్లల గళానికి ప్రాధాన్యం ఇవ్వాలి: విజయవాడలో రాష్ట్రస్థాయి బాలల దినోత్సవ వేడుక *ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు* కార్తీక పౌర్ణమి వేళ అన్నవరంలో వైభవంగా జ్వాలాతోరణ మహోత్సవం విద్యారంగ అభివృద్ధికి మంత్రి నారా లోకేష్ గారి ప్రత్యేక ప్రాధాన్యత… క్షేత్రస్థాయిలో పర్యటించిన ఒంగోలు మేయర్ శ్రీమతి నల్లమల్లి శ్రీ శిల్ప కార్తీక పౌర్ణమి సందర్భంగా వైభవంగా పంపా హారతులు విపి రేగ ఘటనపై కిమిడి నాగార్జున దిగ్భ్రాంతి

రాణి తోటలో సర్పంచ్ అభ్యర్థి పుష్పావతి విస్తృత ప్రచారం ​కుమార్తె శ్వేత, కుమారుడు శ్రీనాథ్‌లతో కలిసి ఇంటింటా ఓట్ల అభ్యర్థన ​ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్న అభ్యర్థి.. గెలిపిస్తే అభివృద్ధి చేస్తానని హామీ

Select Suryaa Now
రాణి తోటలో సర్పంచ్ అభ్యర్థి పుష్పావతి విస్తృత ప్రచారం ​కుమార్తె శ్వేత, కుమారుడు శ్రీనాథ్‌లతో కలిసి ఇంటింటా ఓట్ల అభ్యర్థన ​ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్న అభ్యర్థి.. గెలిపిస్తే అభివృద్ధి చేస్తానని హామీ

వెల్దుర్తి,  మేజర్ న్యూస్:పంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా వెల్దుర్తి సర్పంచ్ అభ్యర్థి పుష్పావతి మంగళవారం పట్టణంలోని రాణి తోట కాలనీలో విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. తన కుమార్తె శ్వేత, కుమారుడు శ్రీనాథ్, స్థానిక నాయకులు మరియు కార్యకర్తలతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్లను ఆప్యాయంగా పలకరిస్తూ తనకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు.ఈ సందర్భంగా కాలనీవాసులు ఎదుర్కొంటున్న తాగునీరు, డ్రైనేజీ, వీధి దీపాలు తదితర మౌలిక వసతుల సమస్యలను పుష్పావతి అడిగి తెలుసుకున్నారు. రాణి తోట ప్రాంత అభివృద్ధికి తాను ఎల్లప్పుడూ ముందుంటానని, సర్పంచ్‌గా ఒక్క అవకాశం ఇస్తే కాలనీలోని సమస్యలన్నింటినీ తక్షణమే పరిష్కరించి ఆదర్శంగా తీర్చిదిద్దుతానని ఆమె ప్రజలకు భరోసా ఇచ్చారు.ప్రచారంలో భాగంగా కుమార్తె శ్వేత, కుమారుడు శ్రీనాథ్ యువత మరియు మహిళలతో ప్రత్యేకంగా మాట్లాడుతూ.. తమ తల్లిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ప్రచారానికి వెళ్లిన ప్రతి చోటా రాణి తోట కాలనీవాసులు పుష్పావతికి ఘనస్వాగతం పలికి తమ సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ పెద్దలు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.