ఘనంగా కార్తీక మాస పూజలు దేవాలయాలకు భక్తుల రద్దీ
కనగల్ మేజర్ న్యూస్: మండలంలోని ధర్వేశిపురం స్టేజి వద్దగల శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయం, కనగల్ శ్రీ పార్వతి బండి రామలింగేశ్వర స్వామి ఆలయం, పొనుగోడు, ధర్వేశిపురం, పగిడిమర్రి, చెట్ల చెన్నారం, కురంపల్లి, గడ్డం వారి ఎడవల్లి, తదితర గ్రామాలలో కార్తీక పౌర్ణమి నీ పురస్కరించుకొని దేవాలయాలకు భక్తుల రద్దీ కొనసాగింది. వివిధ గ్రామాల్లోని పురాతన శివాలయాల్లో ( దేవాలయా) ఉదయం నుంచి అర్చక స్వాములు, భక్తులు అభిషేక పూజలు, కుంకుమార్చన, పుష్పాలంకరణ, పూజలు నిర్వహించారు. సాయంత్రం కాలంలో సహస్ర దీపారాధన మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. దేవాలయాల్లో భక్తులు ఆ పరమశివుని సకల సంపదలు కలగాలని, పిల్లాపాపల సుఖసంతోషాలతో ఉండాలని, పాడిపంటలు సమృద్ధిగా ఉండాలని వేడుకున్నారు. ధర్వేశిపురం ఆలయం దీపాలంకరణతో అమ్మవారు భక్తులకు ప్రత్యేక దర్శనం ఇచ్చారు. ఇదిలా ఉంటే గడ్డం వారి ఎడవెల్లి పురాతన శివాలయంలో డి ఆర్ డి ఓ శేఖర్ రెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో ఆలయ చైర్మన్ చీ దేటి వెంకటరెడ్డి, ఈవో అంబటి నాగిరెడ్డి, అర్చకులు మణికంఠ శర్మ, దామోదర శర్మ, గాదే మహేష్ శర్మ, నాగరాజు శర్మ, శ్రీను, ఆలయ సిబ్బంది, ఆయా దేవాలయాల అర్చక స్వాములు, భక్తులు, గ్రామాల పెద్దలు తదితరులు పాల్గొన్నారు.