BREAKING
విద్యారంగ అభివృద్ధికి మంత్రి నారా లోకేష్ గారి ప్రత్యేక ప్రాధాన్యత… క్షేత్రస్థాయిలో పర్యటించిన ఒంగోలు మేయర్ శ్రీమతి నల్లమల్లి శ్రీ శిల్ప కార్తీక పౌర్ణమి సందర్భంగా వైభవంగా పంపా హారతులు విపి రేగ ఘటనపై కిమిడి నాగార్జున దిగ్భ్రాంతి ఇందిరమ్మ బీమా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం.. దీక్ష దివస్ చారిత్రాత్మక ఘట్టం.. బీసీల హక్కుల సాధనకు కృషి చేస్తా దేవసాని ప్రియదర్శిని ఎన్నికల బరిలో మాజీ సర్పంచ్ సతీమణి కొండమ్మ ​బీసీ కాలనీలో ఇంటింటి ప్రచారానికి శ్రీకారం *కోహెడ గ్రామ పంచాయతీలో ఇందిరమ్మ బీమా పథకని ప్రారంభం ప్రారంభించిన గ్రామ సర్పంచ్ బందెల సుజాత బాలకిషన్* రోగులు బ‌య‌ట మందులు కొనుక్కోవాల‌ని రాయొద్దు వైద్య కళాశాలల ప్రిన్సిపాళ్లు, బోధనాసుపత్రుల సూపరింటెండెంట్లకు డీఎంఈ డాక్టర్ విష్ణువర్ధన్ స్పష్టమైన ఆదేశాలు *కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని శ్రీశ్రీ పంచముఖ సోమేశ్వర ఆలయంలో* అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ పట్టివేత 46వ డివిజన్‌లో దోమల నివారణకు ఫాగింగ్ రాయదుర్గంలో శ్రీ భక్త మార్కండేశ్వర స్వామికి ఘనంగా కేదారేశ్వర గౌరీ వ్రతం!! మానవత్వం చాటుకున్న ఎల్ఐసీ ఏజెంట్ చెరుకూరి వెంకట నారాయణ.. వృద్ధ పేద దంపతులకు నిత్యావసర సరుకుల అందజేత *జాతీయ మాల మహానాడు సిద్దిపేట జిల్లా వర్కింగ్ అధ్యక్షుడిగా చింతల విజయ్ కుమార్*

కేసీఆర్ కోసం పాదయాత్ర

Select Suryaa Now
కేసీఆర్ కోసం పాదయాత్ర

నవాబుపేట సూర్య న్యూస్:బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్లీ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలనే ఆకాంక్షతో నవాబుపేట మండలం దయాపంతులపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు గండు తిరుపతయ్య ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసం వరకు పాదయాత్ర చేపట్టారు.ఈ క్రమంలో పాదయాత్రగా షాద్‌నగర్ నియోజకవర్గానికి చేరుకున్న ఆయనకు పలు గ్రామాల్లో బీఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు తిరుపతయ్యకు ఘన స్వాగతం పలికారు.షాద్‌నగర్ పట్టణంలోని పరిగి రోడ్డులో గల పోచమ్మ దేవాలయం వద్దకు చేరుకున్న తిరుపతయ్యకు ఫరూఖ్‌నగర్ మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు లక్ష్మణ్ నాయక్ ఆధ్వర్యంలో నాయకులు స్వాగతం పలికి సంఘీభావం తెలిపారు.అలాగే లింగారెడ్డిగూడ గ్రామంలోనూ స్థానిక బీఆర్ఎస్ నాయకులు పాదయాత్రకు స్వాగతం పలికారు.అనంతరం నందిగామ మండల కేంద్రానికి చేరుకున్న తిరుపతయ్యకు పలువురు నాయకులు,కార్యకర్తలు అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు,భీమారం సర్పంచ్ గీత వీరేశం గుప్త,స్థానిక కౌన్సిలర్లు జీటీ శ్రీనివాస్,పిల్లి శేఖర్,మాజీ కౌన్సిలర్ జూపల్లి శంకర్,బిక్షపతి,మాజీ సర్పంచ్ రవి గౌడ్,గోవింద్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.