BREAKING
విద్యారంగ అభివృద్ధికి మంత్రి నారా లోకేష్ గారి ప్రత్యేక ప్రాధాన్యత… క్షేత్రస్థాయిలో పర్యటించిన ఒంగోలు మేయర్ శ్రీమతి నల్లమల్లి శ్రీ శిల్ప కార్తీక పౌర్ణమి సందర్భంగా వైభవంగా పంపా హారతులు విపి రేగ ఘటనపై కిమిడి నాగార్జున దిగ్భ్రాంతి ఇందిరమ్మ బీమా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం.. దీక్ష దివస్ చారిత్రాత్మక ఘట్టం.. బీసీల హక్కుల సాధనకు కృషి చేస్తా దేవసాని ప్రియదర్శిని ఎన్నికల బరిలో మాజీ సర్పంచ్ సతీమణి కొండమ్మ ​బీసీ కాలనీలో ఇంటింటి ప్రచారానికి శ్రీకారం *కోహెడ గ్రామ పంచాయతీలో ఇందిరమ్మ బీమా పథకని ప్రారంభం ప్రారంభించిన గ్రామ సర్పంచ్ బందెల సుజాత బాలకిషన్* రోగులు బ‌య‌ట మందులు కొనుక్కోవాల‌ని రాయొద్దు వైద్య కళాశాలల ప్రిన్సిపాళ్లు, బోధనాసుపత్రుల సూపరింటెండెంట్లకు డీఎంఈ డాక్టర్ విష్ణువర్ధన్ స్పష్టమైన ఆదేశాలు *కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని శ్రీశ్రీ పంచముఖ సోమేశ్వర ఆలయంలో* అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ పట్టివేత 46వ డివిజన్‌లో దోమల నివారణకు ఫాగింగ్ రాయదుర్గంలో శ్రీ భక్త మార్కండేశ్వర స్వామికి ఘనంగా కేదారేశ్వర గౌరీ వ్రతం!! మానవత్వం చాటుకున్న ఎల్ఐసీ ఏజెంట్ చెరుకూరి వెంకట నారాయణ.. వృద్ధ పేద దంపతులకు నిత్యావసర సరుకుల అందజేత *జాతీయ మాల మహానాడు సిద్దిపేట జిల్లా వర్కింగ్ అధ్యక్షుడిగా చింతల విజయ్ కుమార్*

భర్త మృతితో కుటుంబ పోషణ భారమైందని ఆవేదన.. న్యాయం చేయాలని అధికారులకు వినతి

Select Suryaa Now
భర్త మృతితో కుటుంబ పోషణ భారమైందని ఆవేదన.. న్యాయం చేయాలని అధికారులకు వినతి

రామాయంపేట;19 సంవత్సరాలుగా ఐసీడీఎస్ కార్యాలయంలో స్వీపర్‌గా విధులు నిర్వహిస్తున్న తనను ఎలాంటి కారణం లేకుండా విధుల నుంచి తొలగించారని రామాయంపేట పట్టణానికి చెందిన అబ్రమైన సుగుణ ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసి, తనను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరారు.ఈ సందర్భంగా సుగుణ మాట్లాడుతూ.. దాదాపు 19 సంవత్సరాలుగా ఐసీడీఎస్ కార్యాలయంలో స్వీపర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నానని తెలిపారు. అయితే తనను అకారణంగా విధుల నుంచి తొలగించడంతో కుటుంబ పోషణ భారంగా మారిందని కన్నీటిపర్యంతమయ్యారు. ఇప్పటికే తన భర్త మరణించడంతో కుటుంబ బాధ్యతలన్నీ తనపైనే ఉన్నాయని, ఉద్యోగం కోల్పోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని వాపోయారు.తనను తిరిగి విధుల్లోకి తీసుకోకపోతే ఆత్మహత్యే శరణ్యమని ప్రజావాణిలో సమర్పించిన ఫిర్యాదు లేఖలో పేర్కొన్నారు. అధికారులు తన పరిస్థితిని మానవతా దృక్పథంతో పరిశీలించి, తిరిగి విధుల్లోకి తీసుకునేలా న్యాయం చేయాలని సుగుణ విజ్ఞప్తి చేశారు.