BREAKING
రాయదుర్గంలో శ్రీ భక్త మార్కండేశ్వర స్వామికి ఘనంగా కేదారేశ్వర గౌరీ వ్రతం!! మానవత్వం చాటుకున్న ఎల్ఐసీ ఏజెంట్ చెరుకూరి వెంకట నారాయణ.. వృద్ధ పేద దంపతులకు నిత్యావసర సరుకుల అందజేత *జాతీయ మాల మహానాడు సిద్దిపేట జిల్లా వర్కింగ్ అధ్యక్షుడిగా చింతల విజయ్ కుమార్* గ్రామాల్లో శాంతిభద్రతలను పటిష్టం చేయాలి సిద్దిపేట పోలీస్ కమిషనర్ రేష్మి పెర్మల్ *ఘనంగా వరకవి గురుపూజోత్సవం* రాణి తోటలో సర్పంచ్ అభ్యర్థి పుష్పావతి విస్తృత ప్రచారం ​కుమార్తె శ్వేత, కుమారుడు శ్రీనాథ్‌లతో కలిసి ఇంటింటా ఓట్ల అభ్యర్థన ​ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్న అభ్యర్థి.. గెలిపిస్తే అభివృద్ధి చేస్తానని హామీ ఘనంగా కార్తీక మాస పూజలు దేవాలయాలకు భక్తుల రద్దీ జాతీయ మాల మహానాడు సిద్దిపేట జిల్లా నూతన కమిటీ ఏర్పాటు జిల్లా అధ్యక్షుడిగా ఆరె కిశోర్ ఎన్నిక సీనియర్ స్టార్ల కంటే యువ నటులతో పనిచేయడమే సులభం.. దర్శకుడు ఇంతియాజ్ అలీ ఆసక్తికర వ్యాఖ్యలు *ఘనంగా వరకవి గురుపూజోత్సవం* -కార్తీక పౌర్ణమి సందర్భంగా ఘనంగా తులసి కల్యాణం భక్తిశ్రద్ధలతో కార్తీక పౌర్ణమి శ్రీ రేణుక మాత ఆలయంలో వైభవంగా ప్రత్యేక పూజలు దీపికా పదుకొణె 8 గంటల పని డిమాండ్‌పై కరణ్ జోహార్ మద్దతు.. మహిళా తారలకు సమాన హక్కులు ఉండాలన్న దర్శకుడు తెలంగాణా ఒక ల్యాండ్ ఆఫ్ సెలబ్రేషన్స్ హైకోర్టు న్యాయమూర్తులు విజయ్ సేన్ రెడ్డి,చలపతిరావు

వెల్దుర్తిలో రసవత్తరంగా పంచాయతీ పోరు! బరిలో 152 మంది సర్పంచ్, 565 మంది వార్డు అభ్యర్థులు నామినేషన్ల పరిశీలన పూర్తి.. బొమ్మిరెడ్డిపల్లి, పుల్లగుమ్మిలో ఏకగ్రీవ దిశగా!

Select Suryaa Now
వెల్దుర్తిలో రసవత్తరంగా పంచాయతీ పోరు! బరిలో 152 మంది సర్పంచ్, 565 మంది వార్డు అభ్యర్థులు నామినేషన్ల పరిశీలన పూర్తి.. బొమ్మిరెడ్డిపల్లి, పుల్లగుమ్మిలో ఏకగ్రీవ దిశగా!

వెల్దుర్తి,  మేజర్ న్యూస్:మూడో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పరిశీలన (స్క్రూటినీ) ప్రక్రియ మంగళవారం (24.11.2026) ప్రశాంతంగా ముగిసింది. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలంలోని 23 గ్రామ పంచాయతీలు, 226 వార్డు స్థానాలకు సంబంధించి అధికారులు అర్హులైన అభ్యర్థుల జాబితాను ప్రకటించారు.  పరిశీలన అనంతరం మండల వ్యాప్తంగా 23 సర్పంచ్ స్థానాలకు 152 మంది, 226 వార్డు సభ్యుల స్థానాలకు 565 మంది అభ్యర్థుల నామినేషన్లు చెల్లుబాటయ్యాయి.  

రెండు పంచాయతీల్లో ఒక్కొక్కరే…

మండలంలోని బొమ్మిరెడ్డిపల్లి, పుల్లగుమ్మి గ్రామ పంచాయతీల సర్పంచ్ పదవులకు ఒక్కొక్కరు చొప్పున మాత్రమే నామినేషన్లు చెల్లుబాటయ్యాయి. దీంతో ఈ రెండు పంచాయతీలు దాదాపు ఏకగ్రీవమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మేజర్ పంచాయతీ అయిన వెల్దుర్తిలో అత్యధికంగా సర్పంచ్ స్థానానికి 17 మంది, 16 వార్డులకు గాను 91 మంది పోటీలో నిలిచారు. బుక్కాపురంలో 12 మంది, కృష్ణపురం, సుదేపల్లి పంచాయతీల్లో 11 మంది చొప్పున సర్పంచ్ బరిలో ఉన్నారు.