శ్రీ రేణుక మాత ఆలయంలో వైభవంగా ప్రత్యేక పూజలు
కొల్చారం;మండల కేంద్రంలోని శ్రీ రేణుక మాత ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. పాల్వంచ మౌనిక కృష్ణ గౌడ్ దంపతుల ఆధ్వర్యంలో వర్ని పూజారి నాగరాజు శర్మ వేద మంత్రోచ్ఛారణల నడుమ అమ్మవారికి విశేష అభిషేకం, ప్రత్యేక అలంకరణతో పాటు పూజా కార్యక్రమాలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆలయంలో భక్తి పారవశ్యం వెల్లివిరిసింది. అమ్మవారిని దర్శించుకున్న భక్తులు ప్రత్యేక పూజల్లో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీ రేణుక మాత ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని భక్తులు కోరారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణ గౌడ్, మాజీ ఎంపీటీసీ అరుణ కృష్ణ గౌడ్, అశోక్ గౌడ్, ఎండుగుల శేఖర్, రామ గౌడ్, కిరణ్ గౌడ్, యాదగిరి, లక్ష్మి నారాయణ గౌడ్, భూపాల్, చింతలగారి రమేష్ , సంజీవులు, అనంతరాజు, వంశీ, సుధాకర్ గౌడ్, పాప గౌడ్, ప్రణీత్ గౌడ్, శేఖర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు