BREAKING
సైబరాబాద్‌లో మూడు రోజుల పాటు ఉచిత షటిల్ సర్వీసులు అవకాశం కల్పిస్తే నిస్వార్థంగా సేవ చేస్తాం: శైలికా రెడ్డి గల్లంతైన ఆరుగురు మత్స్యకారుల కోసం ముమ్మర గాలింపు : రాష్ట్ర వ్యవసాయ, మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు భరోసా ఎన్నికల నిర్వహణపై డి.ఎస్.పి దిశానిర్దేశం .... పోలీసుల ఫ్లాగ్ మార్చ్ బ్రహ్మసముద్రం మండలం రాయలప్ప దొడ్డి గ్రామపంచాయతీలో తోడికోడల మధ్య పరస్పర పోరు. తెలుగుదేశం పార్టీ నుంచి ఒకరు, రెబల్గా ఒకరు పోటీ చేయుచున్నారు. సగరుల డిమాండ్లను సీఎం దృష్టికి తీసుకెళ్తా : ఎమ్మెల్యే గాంధీ జన్నారంలో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు జయశంకర్ పార్కులో నూతన మంచినీటి బోర్ ప్రారంభం.పార్కు అభివృద్ధికి మరింత ప్రాధాన్యత: ఎమ్మెల్యే గాంధీ కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు ప్రత్యేక పూజలు, దీపారాధనలతో ఆధ్యాత్మిక శోభ పాలసీలు, పరిపాలనలో పిల్లల గళానికి ప్రాధాన్యం ఇవ్వాలి: విజయవాడలో రాష్ట్రస్థాయి బాలల దినోత్సవ వేడుక *ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు* కార్తీక పౌర్ణమి వేళ అన్నవరంలో వైభవంగా జ్వాలాతోరణ మహోత్సవం విద్యారంగ అభివృద్ధికి మంత్రి నారా లోకేష్ గారి ప్రత్యేక ప్రాధాన్యత… క్షేత్రస్థాయిలో పర్యటించిన ఒంగోలు మేయర్ శ్రీమతి నల్లమల్లి శ్రీ శిల్ప కార్తీక పౌర్ణమి సందర్భంగా వైభవంగా పంపా హారతులు విపి రేగ ఘటనపై కిమిడి నాగార్జున దిగ్భ్రాంతి

-కార్తీక పౌర్ణమి సందర్భంగా ఘనంగా తులసి కల్యాణం

Select Suryaa Now
-కార్తీక పౌర్ణమి సందర్భంగా ఘనంగా తులసి కల్యాణం

సిద్దిపేట;కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని సిద్దిపేట రూరల్ మండలం పుల్లూరు బండపై వెలసిన స్వయంభూ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు.మంగళవారం ఉదయం స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించిన అనంతరం 50కి పైగా జంటలు వ్రతాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం తులసి కల్యాణాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. భక్తుల రాకతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది.ఈ సందర్భంగా ఆలయ వంశపారంపర్య అర్చకులు కలకుంట్ల వెంకటనరసింహాచార్యులు, కృష్ణమాచార్యులు,రంగాచార్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి సందర్భంగా స్వామివారి సన్నిధిలో సామూహిక సత్యనారాయణ వ్రతాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది కూడా 50కి పైగా జంటలతో వ్రతాలను ఘనంగా నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఈ క్షేత్రంలో ప్రతి నెల స్వాతి నక్షత్రం సందర్భంగా సుదర్శన నరసింహ హోమాన్ని ప్రత్యేకంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. అలాగే వైకుంఠ ఏకాదశి, మాఘ అమావాస్య జాతర, నరసింహ జయంతి వేడుకలను కూడా ఏటా ఘనంగా నిర్వహిస్తున్నట్లు వివరించారు.కార్యక్రమంలో భాగంగా భక్తులకు అన్నప్రసాద వితరణ ఏర్పాటు చేయగా వందలాది మంది భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శేషు కుమార్ వీణాచారి, మాజీ మున్సిపల్ చైర్మన్ మంజుల రాజనర్సు, గ్రామ సర్పంచ్ కుంచం లత వెంకట్, మాజీ సర్పంచులు నరేష్, తిరుపతిరెడ్డి, గ్రామస్తులు రామారావు, దుర్గారెడ్డి, ఉడుత మల్లేశం తదితరులు పాల్గొన్నారు.