పి. కొత్తకోట పంచాయతీ సర్పంచిగా పరదేశి ఏకగ్రీవ ఎన్నిక పంచాయతీ అభివృద్ధి చేయడమే నా ధ్యేయం
పూతలపట్టు మేజర్ న్యూస్ :
మండలం లోని పి కొత్తకోట గ్రామ పంచాయతీ సర్పంచి పదవికి పరదేశి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే సమయానికి బరిలో పరదేశి ఒక్కరే నిలవడంతో, ఎన్నికల అధికారులు ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారికంగా ప్రకటించారు గ్రామంలో ఎటువంటి ఎన్నికల పోటీ, విభేదాలు, ఉద్రిక్తతలు లేకుండా గ్రామస్తులంతా కలిసికట్టుగా ఈ ఏకగ్రీవ నిర్ణయం తీసుకోవడం పట్ల స్థానికంగా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి ఏకగ్రీవంగా ఎన్నికైన అనంతరం పరదేశి మాట్లాడుతూ "పంచాయతీ అభివృద్ధి చేయడమే నా ధ్యేయం" అని స్పష్టం చేశారు తనపై అపార నమ్మకం ఉంచి, ఏకగ్రీవంగా సర్పంచిగా ఎన్నుకున్న గ్రామస్తులందరికీ ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు ఎన్నికల వేళ తలెత్తే రాజకీయ విభేదాలు, వర్గ బేధాలకు తావులేకుండా ప్రతి ఒక్కరినీ కలుపుకొని సమష్టిగా పనిచేస్తానని హామీ ఇచ్చారు అందరి సలహాలు, సూచనలు తీసుకుంటూ పంచాయతీని ప్రగతి పథంలో నడిపిస్తానని చెప్పారు గ్రామంలోని ప్రధాన సమస్యల పరిష్కారానికి తాను తొలి ప్రాధాన్యత ఇస్తానని పరదేశి పేర్కొన్నారు ముఖ్యంగా వేసవిలో తలెత్తే తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడం, అంతర్గత సిమెంట్ రోడ్లు, మురుగునీటి కాలువల నిర్మాణం, పారిశుద్ధ్య మెరుగుదల, కీలక కూడళ్లు, వీధుల్లో వీధి దీపాల ఏర్పాటు వంటి మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారిస్తానని తెలిపారు. అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందేలా కృషి చేస్తానని స్పష్టం చేశారు ప్రభుత్వ నిధులు, పంచాయతీ ఆదాయాన్ని పారదర్శకంగా, సమర్థవంతంగా వినియోగించి పి. కొత్తకోట పంచాయతీని అన్ని రంగాల్లో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని పరదేశి ధీమా వ్యక్తం చేశారు ఏకగ్రీవ ఎన్నికతో గ్రామంలో అభివృద్ధి పనులు వేగవంతమవుతాయని, ఎన్నికల ఖర్చు ఆదా కావడంతో పాటు గ్రామానికి ప్రోత్సాహక నిధులు వచ్చే అవకాశం ఉంటుందని, తద్వారా మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని గ్రామస్తులు ఆశాభావం వ్యక్తం చేశారు.
ఏకగ్రీవంగా ఎన్నికైన పరదేశిని గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు, శ్రేయోభిలాషులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, సజావుగా జరిగేందుకు సహకరించిన అధికారులకు, గ్రామస్తులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.
పూతలపట్టు రిపోర్టర్ దిలీప్ కుమార్