BREAKING
విద్యారంగ అభివృద్ధికి మంత్రి నారా లోకేష్ గారి ప్రత్యేక ప్రాధాన్యత… క్షేత్రస్థాయిలో పర్యటించిన ఒంగోలు మేయర్ శ్రీమతి నల్లమల్లి శ్రీ శిల్ప కార్తీక పౌర్ణమి సందర్భంగా వైభవంగా పంపా హారతులు విపి రేగ ఘటనపై కిమిడి నాగార్జున దిగ్భ్రాంతి ఇందిరమ్మ బీమా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం.. దీక్ష దివస్ చారిత్రాత్మక ఘట్టం.. బీసీల హక్కుల సాధనకు కృషి చేస్తా దేవసాని ప్రియదర్శిని ఎన్నికల బరిలో మాజీ సర్పంచ్ సతీమణి కొండమ్మ ​బీసీ కాలనీలో ఇంటింటి ప్రచారానికి శ్రీకారం *కోహెడ గ్రామ పంచాయతీలో ఇందిరమ్మ బీమా పథకని ప్రారంభం ప్రారంభించిన గ్రామ సర్పంచ్ బందెల సుజాత బాలకిషన్* రోగులు బ‌య‌ట మందులు కొనుక్కోవాల‌ని రాయొద్దు వైద్య కళాశాలల ప్రిన్సిపాళ్లు, బోధనాసుపత్రుల సూపరింటెండెంట్లకు డీఎంఈ డాక్టర్ విష్ణువర్ధన్ స్పష్టమైన ఆదేశాలు *కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని శ్రీశ్రీ పంచముఖ సోమేశ్వర ఆలయంలో* అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ పట్టివేత 46వ డివిజన్‌లో దోమల నివారణకు ఫాగింగ్ రాయదుర్గంలో శ్రీ భక్త మార్కండేశ్వర స్వామికి ఘనంగా కేదారేశ్వర గౌరీ వ్రతం!! మానవత్వం చాటుకున్న ఎల్ఐసీ ఏజెంట్ చెరుకూరి వెంకట నారాయణ.. వృద్ధ పేద దంపతులకు నిత్యావసర సరుకుల అందజేత *జాతీయ మాల మహానాడు సిద్దిపేట జిల్లా వర్కింగ్ అధ్యక్షుడిగా చింతల విజయ్ కుమార్*

ఎస్‌ఐఆర్‌ ఓటరు జాబితా సవరణ పారదర్శకంగా నిర్వహించాలి : కాంగ్రెస్ పార్టీ మైనార్టీ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ ఎస్.కె.బాషా

Select Suryaa Now
ఎస్‌ఐఆర్‌ ఓటరు జాబితా సవరణ పారదర్శకంగా నిర్వహించాలి : కాంగ్రెస్ పార్టీ మైనార్టీ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ ఎస్.కె.బాషా

మదనపల్లె,మేజర్ న్యూస్ : అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లెలోని కలెక్టరేట్‌లో మంగళవారం నిర్వహించిన గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల జిల్లాస్థాయి సమావేశంలో  కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ ఎస్.కె.బాషా పాల్గొన్నారు.ఈ సమావేశంలో ఎస్‌ఐఆర్‌ (స్పెషల్ ఇంటెన్సివ్ రెవిజన్) ఓటరు జాబితా సవరణకు సంబంధించి ఎన్నికల సంఘం ప్రకటించిన సవరించిన షెడ్యూల్‌తోపాటు,జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజక వర్గాల్లో ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ,సేకరణ,పరిశీలన  అంశాలపై చర్చించారు.ఈ సమావేశంలో వెల్లడించిన గణాంకాల ప్రకారం,అన్నమయ్య జిల్లా లో రాయచోటి,తంబళ్లపల్లె,పీలేరు,మదనపల్లె,పుంగనూరు ఐదు నియోజకవర్గాల పరిధిలో మొత్తం 12,32,439 మంది ఓటర్లు ఉన్నారు.అందులో 1,48,703 మంది ఓటర్లకు సంబంధించిన ఎన్యూమ రేషన్ ఫారాలను సేకరించలేని పరిస్థితి ఉన్నట్లు నివేదికలో పేర్కొన్నారు.ఇది మొత్తం ఓటర్లలో 12.07 శాతంగా ఉందన్నారు.ముఖ్యంగా 164 - మదనపల్లె నియో జకవర్గంలో మొత్తం 2,70,426 మంది ఓటర్లు ఉండగా,32,146 మంది ఓటర్లకు సంబంధించిన ఎన్యూమరేషన్ ఫారాలు సేకరించలేని జాబితాలో ఉన్నారు.వీరిలో మరణించినవారు,చిరునామాలో అందుబాటులో లేనివారు,శాశ్వతంగా వలస వెళ్లినవారు,ఇతర కారణాలతో గుర్తించబడినవారు ఉన్నట్లు నివేదికలో వివరించారు.ఈ జాబితాను రాజకీయ పార్టీలకు అందించాలని సమావేశంలో కోరారు.ఈ సందర్భంగా డాక్టర్ ఎస్ కె బాషాతోపాటు వివిధ పార్టీలకు చెందిన పలువురు నాయకులు మాట్లాడుతూ ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో అర్హులైన ఓటర్లె వరూ తమ ఓటుహక్కును కోల్పో కుండా ఎన్నికల అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.ముఖ్యంగా అందుబాటులో లేని ఓటర్ల విషయంలో క్షేత్రస్థాయిలో మరోసారి సమగ్ర పరిశీలన జరపాలని,మరణించిన వారు,శాశ్వతంగా వలస వెళ్లినవారు,చిరునామా మారినవారి వివరాలను పూర్తిస్థాయిలో నిర్ధారించ కుండా ఓటర్ల పేర్లను తొలగించకూడదని పేర్కొన్నారు.రాజకీయ పార్టీల బీఎల్ఏలు సంబంధిత బీఎల్ఓలకు సహకరించాలని కోరారు.అనంతరం కాంగ్రెస్ పార్టీ మైనార్టీ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ ఎస్.కె.బాషా మాట్లాడుతూ,ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటుహక్కు కల్పించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని,ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ,సేకరణ చేపట్టాలని అన్నారు.అలాగే ఓటరు జాబితాలో పేర్లు నమోదు,సవరణలు,తొలగిం పుల విషయంలో పారదర్శకత పాటించాలని,రాజకీయ పార్టీల ప్రతినిధులకు అవసరమైన సమాచారం అందించాలని కోరారు.ఎన్నికల సంఘం ప్రకటించిన సవరించిన షెడ్యూల్ ప్రకారం నవంబర్ 30వ తేదీ వరకు ఎన్యూమ రేషన్ ఫారాల పంపిణీ,సేకరణ ప్రక్రియ కొనసాగనుండగా,2026 డిసెంబర్ 22న తుది ఓటరు జాబితా ప్రచురించనున్నారు.

రిపోర్టర్ : కే.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి