BREAKING
విద్యారంగ అభివృద్ధికి మంత్రి నారా లోకేష్ గారి ప్రత్యేక ప్రాధాన్యత… క్షేత్రస్థాయిలో పర్యటించిన ఒంగోలు మేయర్ శ్రీమతి నల్లమల్లి శ్రీ శిల్ప కార్తీక పౌర్ణమి సందర్భంగా వైభవంగా పంపా హారతులు విపి రేగ ఘటనపై కిమిడి నాగార్జున దిగ్భ్రాంతి ఇందిరమ్మ బీమా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం.. దీక్ష దివస్ చారిత్రాత్మక ఘట్టం.. బీసీల హక్కుల సాధనకు కృషి చేస్తా దేవసాని ప్రియదర్శిని ఎన్నికల బరిలో మాజీ సర్పంచ్ సతీమణి కొండమ్మ ​బీసీ కాలనీలో ఇంటింటి ప్రచారానికి శ్రీకారం *కోహెడ గ్రామ పంచాయతీలో ఇందిరమ్మ బీమా పథకని ప్రారంభం ప్రారంభించిన గ్రామ సర్పంచ్ బందెల సుజాత బాలకిషన్* రోగులు బ‌య‌ట మందులు కొనుక్కోవాల‌ని రాయొద్దు వైద్య కళాశాలల ప్రిన్సిపాళ్లు, బోధనాసుపత్రుల సూపరింటెండెంట్లకు డీఎంఈ డాక్టర్ విష్ణువర్ధన్ స్పష్టమైన ఆదేశాలు *కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని శ్రీశ్రీ పంచముఖ సోమేశ్వర ఆలయంలో* అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ పట్టివేత 46వ డివిజన్‌లో దోమల నివారణకు ఫాగింగ్ రాయదుర్గంలో శ్రీ భక్త మార్కండేశ్వర స్వామికి ఘనంగా కేదారేశ్వర గౌరీ వ్రతం!! మానవత్వం చాటుకున్న ఎల్ఐసీ ఏజెంట్ చెరుకూరి వెంకట నారాయణ.. వృద్ధ పేద దంపతులకు నిత్యావసర సరుకుల అందజేత *జాతీయ మాల మహానాడు సిద్దిపేట జిల్లా వర్కింగ్ అధ్యక్షుడిగా చింతల విజయ్ కుమార్*

అంతర్జాతీయ స్థాయిలో 'రామాయణ' సత్తా.. క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్స్ షార్ట్‌లిస్ట్‌లో రెండు విభాగాల్లో చోటు

Select Suryaa Now
అంతర్జాతీయ స్థాయిలో 'రామాయణ' సత్తా.. క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్స్ షార్ట్‌లిస్ట్‌లో రెండు విభాగాల్లో చోటు

సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: నితేష్ తివారీ దర్శకత్వంలో రణబీర్ కపూర్, యష్ ప్రధాన పాత్రల్లో రూపొందిన ప్రతిష్ఠాత్మక చిత్రం రామాయణ పార్ట్ 1 అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు సాధించింది. 32వ వార్షిక క్రిటిక్స్ ఛాయిస్ అవార్డుల ప్రాథమిక షార్ట్‌లిస్ట్‌లో ఈ భారతీయ ఇతిహాస చిత్రం రెండు కీలక సాంకేతిక విభాగాల్లో చోటు దక్కించుకుంది. ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్, ఉత్తమ స్టంట్ డిజైన్ విభాగాల్లో ది ఒడిస్సీ, డ్యూన్ పార్ట్ త్రీ వంటి భారీ హాలీవుడ్ చిత్రాలతో కలిసి పోటీ పడుతోంది.

అంతర్జాతీయ మార్కెట్లలో రామాయణ రైజ్ ఆఫ్ ఎ లెజెండ్ పేరుతో విడుదలైన ఈ చిత్రం తన సాంకేతిక ప్రమాణాలతో విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం వహించిన ది ఒడిస్సీ 11 విభాగాల్లో, డెనిస్ విల్లెన్యూవ్ రూపొందించిన డ్యూన్ పార్ట్ త్రీ 8 విభాగాల్లో నిలవగా, వాటి సరసన మన దేశీయ చిత్రం నిలవడం విశేషం. ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే, గాడ్జిల్లా మైనస్ జీరో వంటి చిత్రాలతో రామాయణ పోటీపడుతోంది.

అయితే ఇది కేవలం మొదటి దశ ఎంపిక మాత్రమేనని నిర్వాహకులు స్పష్టం చేశారు. ప్రత్యేక నామినేషన్ కమిటీ 12 సాంకేతిక విభాగాల్లో మొత్తం 59 చిత్రాలను ప్రాథమికంగా ఎంపిక చేయగా, తుది నామినేషన్లను డిసెంబర్ 4న ప్రకటించనున్నారు. ఒక్కో విభాగంలో ఆరు చిత్రాలు తుది రేసులో నిలవనుండగా, 2027 జనవరి 3న శాంటా మోనికాలో అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది.

నమిత్ మల్హోత్రా, యష్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో రాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణుడిగా యష్ నటించారు. హన్స్ జిమ్మర్, ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ సినిమా కొనసాగింపుగా రామాయణ పార్ట్ 2 చిత్రం 2028 దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది.