భక్తులతో కిటకిటలాడిన శివాలయాలు
నల్లగొండ టౌన్, మేజర్ న్యూస్: కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని మంగళవారం తెల్లవారుజాము నుండి శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి పట్టణంలోని శివాలయాలతో పాటు పానగల్ లో గల ఛాయాసోమేశ్వర ఆలయానికి భక్తులు పోటెత్తారు మహిళలు యువతులు ,అభిషేకాలు దీపారాధనలు చేసి కోనేటిలో వదిలారు ఈ దేవాలయానికి నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ
కార్తీక మాసం శివారాధనకు ఎంతో పవిత్రమైన మాసమని, కార్తీక పౌర్ణమి రోజున ఛాయా సోమేశ్వర స్వామివారిని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు
*వేద మంత్రోచ్చరణాల మధ్య భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు*
ఆలయ అర్చకులు మేయర్ కుటుంబ సభ్యులకు ఆశీర్వచనం అందించి తీర్థప్రసాదాలు అందజేశారు భక్తిభావంతో పూజలు నిర్వహిస్తూ, ఆధ్యాత్మిక చింతనతో పాటు మన సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించాలని కోరారు*
*నల్లగొండ పట్టణంలోని పానగల్ ఛాయా సోమేశ్వర ఆలయం ఎంతో చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాశస్త్యం కలిగిన దేవాలయమని అన్నారు*.*ఆలయ అభివృద్ధికి ఇటీవల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గ సహకారంతో రూ.20 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు.ఈ నిధులతో ఆలయాన్ని ఆధ్యాత్మికంగా, పర్యాటకంగా మరింత అభివృద్ధి చేయడం జరుగుతుందని పేర్కొన్నారు*
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కేసాని వేణుగోపాల్ రెడ్డి, అల్లి సుభాష్ యాదవ్, ఆలకుంట్ల ఝాన్సీ నాగరత్నం రాజు, మామిడి కార్తీక్, ఆలకుంట్ల నాగరాజు, ఆలయ చైర్మన్ కొడదల ఎల్లయ్య,జిల్లా ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులు ఏడుదొడ్ల వెంకటరామిరెడ్డి, ఏదుళ్ళ శ్రీధర్ రెడ్డి,యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గాలి నాగరాజు తదితరులు పాల్గొన్నారు*