BREAKING
సీనియర్ స్టార్ల కంటే యువ నటులతో పనిచేయడమే సులభం.. దర్శకుడు ఇంతియాజ్ అలీ ఆసక్తికర వ్యాఖ్యలు *ఘనంగా వరకవి గురుపూజోత్సవం* -కార్తీక పౌర్ణమి సందర్భంగా ఘనంగా తులసి కల్యాణం భక్తిశ్రద్ధలతో కార్తీక పౌర్ణమి శ్రీ రేణుక మాత ఆలయంలో వైభవంగా ప్రత్యేక పూజలు దీపికా పదుకొణె 8 గంటల పని డిమాండ్‌పై కరణ్ జోహార్ మద్దతు.. మహిళా తారలకు సమాన హక్కులు ఉండాలన్న దర్శకుడు తెలంగాణా ఒక ల్యాండ్ ఆఫ్ సెలబ్రేషన్స్ హైకోర్టు న్యాయమూర్తులు విజయ్ సేన్ రెడ్డి,చలపతిరావు బలూచిస్తాన్‌లో మరో దారుణం: ఆరోగ్య కార్యకర్తను కిడ్నాప్ చేసిన పాకిస్థాన్ భద్రతా బలగాలు.. కేసీఆర్ కోసం పాదయాత్ర భర్త మృతితో కుటుంబ పోషణ భారమైందని ఆవేదన.. న్యాయం చేయాలని అధికారులకు వినతి అంతర్జాతీయ స్థాయిలో 'రామాయణ' సత్తా.. క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్స్ షార్ట్‌లిస్ట్‌లో రెండు విభాగాల్లో చోటు ఎస్‌ఐఆర్‌ ఓటరు జాబితా సవరణ పారదర్శకంగా నిర్వహించాలి : కాంగ్రెస్ పార్టీ మైనార్టీ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ ఎస్.కె.బాషా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం దరఖాస్తుల నమోదు ప్రక్రియను గుంతల తో కూడిన రోడ్డు ప్రమాద స్థితిలో వాహనదారులు 'పొల్లాధవన్' సినిమాను 'బైసికల్ థీవ్స్'తో పోల్చడం అవమానమే.. వెట్రిమారన్ ఆసక్తికర వ్యాఖ్యలు

కార్తీక పౌర్ణమి సందర్భంగా యాదగిరిగుట్టకు పోటెత్తిన భక్తులు

Select Suryaa Now
కార్తీక పౌర్ణమి సందర్భంగా యాదగిరిగుట్టకు పోటెత్తిన భక్తులు


యాదాద్రి ప్రతినిధి :కార్తీక పౌర్ణమి పర్వదినం సందర్భంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. మంగళవారం సుమారు 70 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. గతేడాదితో పోలిస్తే భక్తుల సంఖ్య పెరిగింది. ప్రధాన ఆలయం, పాతగుట్టలో కలిపి 2,410 సత్యనారాయణ స్వామి వ్రతాలు జరిగాయి.భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు తెల్లవారుజామున 4 గంటల నుంచే వ్రతాలు ప్రారంభించారు. ప్రధాన ఆలయంలో 2,150, పాతగుట్టలో 260 వ్రతాలు నిర్వహించారు. 1,400 మంది బ్రేక్‌ దర్శనం, 8 వేల మంది ప్రత్యేక దర్శనం, 60,600 మంది ధర్మదర్శనం చేసుకున్నారు.మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు స్వామివారికి సంప్రదాయబద్ధంగా అన్నకూటోత్సవం నిర్వహించారు. ఈ సమయంలో దర్శనాలు, వాహనాల రాకపోకలను నిలిపివేసి అనంతరం పునరుద్ధరించారు. క్యూలైన్లను అధికారులు పర్యవేక్షించడంతోపాటు పోలీసుల సహకారంతో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.కొండపైనున్న శ్రీ పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వరస్వామి ఆలయంలోనూ భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ప్రధాన ఆలయం ఎదుట ఏర్పాటు చేసిన కార్తీక దీపం, అఖండ దీపం వద్ద దీపాలు వెలిగించారు. సాయంత్రం 6.30 గంటలకు ప్రధాన ఆలయం, శివాలయాల్లో ఆకాశదీపం, కార్తీక దీపారాధనలు వైభవంగా నిర్వహించారు. దీపాల వెలుగులతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.