BREAKING
రెండు రోజుల్లో 341 నామినేషన్లు స్వీకరణ హీట్ పెంచిన దండుగోపాలపురం రాజకీయం భారీ వర్షాల హెచ్చరిక.. అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి.. మేయర్ పీఠంపై కూటమి జెండా ఎగరడం ఖాయం.. నవజాత శిశు సంరక్షణ వారోత్సవాలకు శ్రీకారం మంత్రి అచ్చెన్నాయుడుతో ఎంపీటీసీల భేటీ నామినేషన్ కేంద్రాల్లో వసతులపై ఆరా ములగ సాగుతో అదనపు ఆదాయం పొందాలి మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలిగా రేణుక సిద్దిపేట జిల్లా మహిళా కాంగ్రెస్ పగ్గాలు అడ్వకేట్ గడ్డం రేణుకకు అంతర్జాతీయ వేదికపై టెక్కలి క్రీడాకారుల గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు చెట్టుపై నుంచి కాలుజారి చెరువులో పడి వృద్ధుడు మృతి చినవంకలో కూటమికి జన జాతర. పేదవారికి చేయూతనే పింఛన్ అర్హులైన పేదలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్న ప్రజా ప్రభుత్వం సర్పంచ్ షాబుద్దీన్ వైసీపీని వీడి టీడీపీలో చేరిన 30 కుటుంబాలు మేజర్ పంచాయతీ సర్పంచ్ బరిలో చింతు శకుంతల..

ఆలయ నిర్మాణానికి రూ.70 లక్షల సొంత నిధులు.. భక్తి భావాన్ని చాటుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి..

Select Suryaa Now
ఆలయ నిర్మాణానికి రూ.70 లక్షల సొంత నిధులు..  భక్తి భావాన్ని చాటుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి..

అమీన్ పూర్ ; అమీన్ పూర్ డివిజన్ పరిధిలోని సుల్తాన్పూర్ గ్రామంలో 70 లక్షల రూపాయల సొంత నిధులతో శ్రీ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి, రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయాలను నిర్మించి మరో పారు తన దైవభక్తిని చాటుకున్నారు. సోమవారం అంగరంగ వైభవంగా నిర్వహించిన దేవత విగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమానికి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. 
సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు దేవాలయాలు ప్రతీకలుగా నిలుస్తాయని ఆయన పేర్కొన్నారు. దేవాలయాలు కేవలం ఆధ్యాత్మిక కేంద్రాలే కాకుండా ప్రజల్లో భక్తి భావాన్ని సామాజిక ఐక్యతను పెంపొందించే పవిత్ర ప్రదేశాలని అన్నారు. సుల్తాన్పూర్ గ్రామంలో భక్తుల చిరకాల ఆకాంక్ష మేరకు 70 లక్షల రూపాయలతో నూతన దేవాలయాలు నిర్మించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ దేవానంద్, మాజీ జెడ్పిటిసి సుధాకర్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ నరసింహ గౌడ్, మాజీ సర్పంచ్ రాజు ,నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.