BREAKING
కోఆప్షన్, ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికలను నిబంధనల మేరకు నిర్వహించాలి కార్తీక మాసం సందర్భంగా మల్లేశ్వరస్వామి ఆలయంలో విశేష పూజలు శ్రీ కనకదుర్గమ్మను దర్శించుకున్న పాఠశాల విద్యార్థులు శ్రీ కనకదుర్గమ్మను దర్శించుకున్న శేఖర్ మాస్టర్ రిటైర్మెంట్‌తో పాటు వారసత్వ సంపద సృష్టికి ఐసీఐసీఐ లైఫ్ సిగ్నేచర్ పెన్షన్ ఉద్యోగుల సమస్యల పరిష్కారమే ఏపీ ఎన్జీవో సంఘం లక్ష్యం 12వ పీఆర్సీ నివేదికను త్వరితగతిన సమగ్రంగా రూపొందించాలి 12వ పీఆర్సీ నివేదికను త్వరితగతిన సమగ్రంగా రూపొందించాలి ఆసియా క్రీడల్లో రజత పతక విజేత విజయ్ గోగులమూడికి ఘన సన్మానం 23న జిల్లా స్థాయి పారా క్రీడల ఎంపికలు నామినేషన్ కేంద్రం ఏర్పాట్లపై జనరల్ అబ్జర్వర్ పరిశీలన అక్వాన్ తుఫాన్ నేపథ్యంలో విద్యుత్ కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు గ్రామ పంచాయతీ ఎన్నికల విధుల్లో ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం నవంబర్ 22న పోస్టల్ బ్యాలెట్ కేంద్రాల ఏర్పాటు గుడివాడలో ఈ నెల 20న భారీ జాబ్‌మేళా

అంతర్జాతీయ వేదికపై టెక్కలి క్రీడాకారుల గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు

Select Suryaa Now
అంతర్జాతీయ వేదికపై టెక్కలి క్రీడాకారుల గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు


- క్రీడాకారులు, కోచ్‌ను అభినందించిన మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
కోటబొమ్మాళి, నవంబరు 16, మేజర్ న్యూస్:
​అంతర్జాతీయ స్థాయిలో అరుదైన ఘనత సాధించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించిన టెక్కలి టైక్వాండో క్రీడాకారులను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రత్యేకంగా అభినందించారు. సోమవారం నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో గిన్నిస్ గుర్తింపు పొందిన టెక్కలి ఎన్టీఆర్ క్రీడా వికాస కేంద్రం బృందాన్ని ఆయన కలిశారు.

​2026 ఆగస్టు 9న హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన టైక్వాండో పోటీల్లో శిక్షకుడు నర్సిపురం శేఖర్ ఆధ్వర్యంలో క్రీడాకారులు మెండ తపస్వి (బ్లాక్ బెల్ట్), తమిరె జ్ఞానదీప్, అట్టాడ మహీధర్ నాయుడు అద్భుత ప్రతిభ కనబరిచి ప్రపంచ రికార్డు సృష్టించారు. వీరి ఘనతను అధికారికంగా ధ్రువీకరిస్తూ లండన్‌లోని గిన్నిస్ సంస్థ ధ్రువపత్రాలతో పాటు బంగారు పతకాలను పంపించింది. క్రీడాకారుల పట్టుదల, కోచ్ శేఖర్ శిక్షణ యావత్ దేశానికే గర్వకారణమని కొనియాడిన మంత్రి, భవిష్యత్తులోనూ వీరు మరిన్ని విజయాలు సాధించి రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.