పేదవారికి చేయూతనే పింఛన్ అర్హులైన పేదలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్న ప్రజా ప్రభుత్వం సర్పంచ్ షాబుద్దీన్
సదాశివపేట ; పేదవారి కష్టాలను గుర్తించి వారికి ఆర్థిక భరోసా కల్పించడమే చేయూత పింఛన్ల ప్రధాన ఉద్దేశమని మెలిగిరిపేట గ్రామ సర్పంచ్ షాబుద్దీన్ అన్నారు.రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించిన చేయూత పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా గ్రామంలో నూతనంగా మంజూరైన పింఛన్లను లబ్ధిదారులకు అందజేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ షాబుద్దీన్ మాట్లాడుతూ.. పేదవారికి ప్రభుత్వం అందిస్తున్న చేయూత పింఛన్ ఎంతో ఉపయోగకరమని, వృద్ధులు, పేద కుటుంబాలకు ఈ పింఛన్ ఆర్థికంగా అండగా నిలుస్తుందని తెలిపారు. పేదవారి కష్టాలను, వారి అవసరాలను గుర్తించే గొప్ప నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని కొనియాడారు.ఈ సందర్భంగా నూతనంగా చేయూత పింఛన్లు పొందిన దొబ్బల బలరాం, టేకూరి రమేష్‌లకు పింఛన్ మంజూరు పత్రాలను అందజేశారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ యాదయ్య, విలేజ్ సెక్రటరీ రాములు తదితరులు పాల్గొన్నారు.