BREAKING
పంచాయితీ ఎన్నికలకు నామినేషన్లు దాఖలు చేసిన కూటమి మద్దతుదారులు ఏకగ్రీవం అభివృద్ధికి మార్గం..! మైదానంలో సంజూ శాంసన్ విశ్వరూపం.. 16 బంతుల్లోనే పరుగుల సునామీ.. మహారాష్ట్రపై కేరళ భారీ స్కోరు! పీఎం స్వన్నిధి అమలులో నగరపాలక సంస్థ కు అవార్డు... ఆయుర్వేద వైద్యంతో నిండైన ఆరోగ్యం కట్టంగూరు మండలంలోనీ ప్రజావాణికి నో రెస్పాన్స్..ఫిర్యాదులు లేక వెలవెలబోతున్న ప్రజావాణి! ఎల్.కోటలో జోరుగా నామినేషన్లు.. మేజర్ పంచాయతీలో నువ్వా నేనా! ఉపాధ్యాయుడు సామన్న దొర హత్య కేసులో నిందితులందరినీ అరెస్టు చేయాలి ఖాసాపేట సర్పంచ్ అభ్యర్థిగా కోళ్ల హసీతా నాయుడు నామినేషన్ దాఖలు దుకాణాల అద్దె బకాయులు తక్షణమే చెల్లించాలి.. సంగాం శ్రీ సంగమేశ్వర స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు పారిశుద్ధ్య నిర్వహణ లో నిర్లక్ష్యం తగదు.... కవితా పఠనంతో సభను అలరించిన యువ కవి.. నీలం గేదెల.. గుండ లక్ష్మీదేవి గెలుపే లక్ష్యం... " ఎగిరిపోమాకు" పుస్తకావిష్కరణ

చెట్టుపై నుంచి కాలుజారి చెరువులో పడి వృద్ధుడు మృతి

Select Suryaa Now
చెట్టుపై నుంచి కాలుజారి చెరువులో పడి వృద్ధుడు మృతి

 

కోటబొమ్మాళి, నవంబరు 16, మేజర్ న్యూస్: త్రినాథ్ స్వామి పూజ కోసం మర్రిచెట్టు కొమ్మలు కోస్తుండగా ప్రమాదవశాత్తు కాలుజారి చెరువులో పడి ఓ వృద్ధుడు ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన కోటబొమ్మాళి మండలం చవితిపేట గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది.

​పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చవితిపేట గ్రామానికి చెందిన యండ రామారావు (75) ఆదివారం సాయంత్రం సుమారు 5:30 గంటల సమయంలో త్రినాథ్ స్వామి పూజ నిమిత్తం గ్రామ చివరన ఉన్న 'మర్రి బంధ' చెరువు వద్దకు వెళ్లారు. అక్కడ చెరువు గట్టుపై ఉన్న మర్రిచెట్టు కొమ్మలను కోస్తుండగా, అకస్మాత్తుగా పట్టుతప్పి చెరువులో పడిపోయారు. చెరువులో నీటి మట్టం ఎక్కువగా ఉండటంతో, ఈత రాకపోవడం లేదా వృద్ధాప్యం కారణంగా బయటకు రాలేక నీటిలో మునిగి ఊపిరాడక అక్కడికక్కడే మృతి చెందారు.

​సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు చెరువు వద్దకు చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతుని భార్య ఉమ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కోటబొమ్మాళి ఎస్ఐ వి. సత్యనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడు రామారావుకు ఇద్దరు కుమారులు ఉన్నారు. పండుగ పూట గ్రామంలో ఈ విషాదం చోటుచేసుకోవడంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.