BREAKING
ఘనంగా 365 వోత్తుల దీపారాధన షార్జా టెస్టులో ఉత్కంఠ.. ఓటమి అంచున అఫ్గానిస్థాన్.. విజయానికి జింబాబ్వే అడుగు దూరంలో! 48 బంతుల్లోనే 135 పరుగుల సునామీ.. 12 ఏళ్ల ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన రజత్ పాటిదార్! జాతీయ కవి సమ్మేళనంలో లింగాల నరసింగరావుకు అరుదైన గౌరవం పంచాయితీ ఎన్నికలకు నామినేషన్లు దాఖలు చేసిన కూటమి మద్దతుదారులు ఏకగ్రీవం అభివృద్ధికి మార్గం..! మైదానంలో సంజూ శాంసన్ విశ్వరూపం.. 16 బంతుల్లోనే పరుగుల సునామీ.. మహారాష్ట్రపై కేరళ భారీ స్కోరు! పీఎం స్వన్నిధి అమలులో నగరపాలక సంస్థ కు అవార్డు... ఆయుర్వేద వైద్యంతో నిండైన ఆరోగ్యం కట్టంగూరు మండలంలోనీ ప్రజావాణికి నో రెస్పాన్స్..ఫిర్యాదులు లేక వెలవెలబోతున్న ప్రజావాణి! ఎల్.కోటలో జోరుగా నామినేషన్లు.. మేజర్ పంచాయతీలో నువ్వా నేనా! ఉపాధ్యాయుడు సామన్న దొర హత్య కేసులో నిందితులందరినీ అరెస్టు చేయాలి ఖాసాపేట సర్పంచ్ అభ్యర్థిగా కోళ్ల హసీతా నాయుడు నామినేషన్ దాఖలు దుకాణాల అద్దె బకాయులు తక్షణమే చెల్లించాలి.. సంగాం శ్రీ సంగమేశ్వర స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు

ఏకగ్రీవం అభివృద్ధికి మార్గం..!

Select Suryaa Now
ఏకగ్రీవం అభివృద్ధికి మార్గం..!
  •  ముంజేరు పంచాయతీకి రూ.1.30 కోట్లు ఇస్తానంటున్న స్థానిక నేత..!
  •  బైరెడ్డిపాలెంలో రూ.1.50 కోట్లతో అభివృద్ధికి యువత ముందడుగు..!
  • గ్రామాల అభివృద్ధి కోసం ఐక్యంగా అడుగులు వేస్తున్న గ్రామస్థులు

భోగాపురం, నవంబర్ 17, (మేజర్ న్యూస్): స్థానిక సంస్థల ఎన్నికల వేళ గ్రామాల్లో సరికొత్త ఆలోచనలు తెరపైకి వస్తున్నాయి. సర్పంచ్ పదవుల కోసం పోటీ పడటం, రాజకీయ ఆధిపత్యం కోసం ప్రయత్నించడం సాధారణంగా కనిపించే పరిణామాలు కాగా.. అందుకు భిన్నంగా గ్రామ అభివృద్ధే లక్ష్యంగా ఏకతాటిపైకి వచ్చేందుకు కొన్ని గ్రామాల ప్రజలు ప్రయత్నిస్తుండటం ఆసక్తిని రేకెత్తిస్తోంది. వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కంటే గ్రామానికి అవసరమైన మౌలిక వసతుల కల్పనకే ప్రాధాన్యమిస్తూ, ఏకగ్రీవ ఎన్నికల దిశగా అడుగులు వేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో భోగాపురం మండలంలోని ముంజేరు, బైరెడ్డిపాలెం పంచాయతీలు చర్చనీయాంశంగా మారుతున్నాయి.
* ముంజేరులో రూ.1.30 కోట్ల ప్రతిపాదన!
ముంజేరు గ్రామపంచాయతీలో సర్పంచ్ ఎన్నికను ఏకగ్రీవం చేసేందుకు ఓ స్థానిక నేత ముందుకొచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. గ్రామస్థులందరూ తనకు మద్దతు తెలిపి ఏకగ్రీవంగా ఎన్నుకుంటే పంచాయతీ అభివృద్ధి కోసం రూ.1.30 కోట్లు వెచ్చిస్తానని ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ నిధులతో గ్రామంలో తాగునీరు, రహదారులు, మురుగు కాలువలు వంటి మౌలిక వసతులు కల్పించడంతో పాటు ఏళ్ల తరబడి అభివృద్ధికి నోచుకోని రామాలయ నిర్మాణాన్ని చేపట్టాలనే ఆలోచన ఉన్నట్లు తెలుస్తోంది. ప్రజలకు అవసరమైన ఇతర సౌకర్యాలను కూడా కల్పించాలనే లక్ష్యంతో ఈ ప్రతిపాదన తెరపైకి వచ్చినట్లు స్థానికంగా చర్చ సాగుతోంది.
* బైరెడ్డిపాలెంలో యువత ముందడుగు!
ఇదే మండలంలోని బైరెడ్డిపాలెం పంచాయతీలోనూ సర్పంచ్ పదవిపై ఆసక్తి చూపుతున్న వారి మధ్య గ్రామాభివృద్ధి అంశం ప్రధానంగా మారినట్లు తెలుస్తోంది. కొందరు పోటీకి ఉత్సాహం చూపుతున్న తరుణంలో యువత ముందుకొచ్చి గ్రామానికి తమ వంతుగా రూ.1.50 కోట్లు కేటాయించేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మొత్తంతో రహదారులు, కాలువలు, తాగునీటి సదుపాయాలు కల్పించడంతో పాటు విమానాశ్రయ నిర్మాణ సమయంలో తొలగించబడిన ఆలయాలను తిరిగి నిర్మించుకోవాలనే ఆలోచన ఉన్నట్లు సమాచారం. గ్రామానికి అవసరమైన మౌలిక వసతులన్నింటినీ సమకూర్చుకోవాలనే సంకల్పంతో యువత ముందడుగు వేస్తున్నట్లు స్థానికంగా చర్చించుకుంటున్నారు.
* ఏకగ్రీవంతో అభివృద్ధి సాధ్యమేనా?
సర్పంచ్ ఎన్నికల్లో పోటీ, రాజకీయ విభేదాలు పక్కనపెట్టి గ్రామస్థులంతా ఒక్కతాటిపైకి వస్తే అభివృద్ధి కార్యక్రమాలకు మరింత అవకాశం ఉంటుందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. అయితే ఏకగ్రీవ ఎన్నికలతోనే అభివృద్ధి సాధ్యమవుతుందా? ప్రకటించిన నిధులు వాస్తవరూపం దాల్చుతాయా? గ్రామ అవసరాలకు అనుగుణంగా వాటిని పారదర్శకంగా వినియోగిస్తారా? అన్నది కీలకంగా మారనుంది. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ముంజేరు, బైరెడ్డిపాలెం తరహాలో మరిన్ని పంచాయతీల్లోనూ ఇలాంటి ప్రతిపాదనలు తెరపైకి వస్తాయా? గ్రామాల అభివృద్ధి కోసం ఇంకెవరు ముందుకొస్తారు? అన్నది వేచి చూడాల్సిందే