BREAKING
ఘనంగా 365 వోత్తుల దీపారాధన షార్జా టెస్టులో ఉత్కంఠ.. ఓటమి అంచున అఫ్గానిస్థాన్.. విజయానికి జింబాబ్వే అడుగు దూరంలో! 48 బంతుల్లోనే 135 పరుగుల సునామీ.. 12 ఏళ్ల ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన రజత్ పాటిదార్! జాతీయ కవి సమ్మేళనంలో లింగాల నరసింగరావుకు అరుదైన గౌరవం పంచాయితీ ఎన్నికలకు నామినేషన్లు దాఖలు చేసిన కూటమి మద్దతుదారులు ఏకగ్రీవం అభివృద్ధికి మార్గం..! మైదానంలో సంజూ శాంసన్ విశ్వరూపం.. 16 బంతుల్లోనే పరుగుల సునామీ.. మహారాష్ట్రపై కేరళ భారీ స్కోరు! పీఎం స్వన్నిధి అమలులో నగరపాలక సంస్థ కు అవార్డు... ఆయుర్వేద వైద్యంతో నిండైన ఆరోగ్యం కట్టంగూరు మండలంలోనీ ప్రజావాణికి నో రెస్పాన్స్..ఫిర్యాదులు లేక వెలవెలబోతున్న ప్రజావాణి! ఎల్.కోటలో జోరుగా నామినేషన్లు.. మేజర్ పంచాయతీలో నువ్వా నేనా! ఉపాధ్యాయుడు సామన్న దొర హత్య కేసులో నిందితులందరినీ అరెస్టు చేయాలి ఖాసాపేట సర్పంచ్ అభ్యర్థిగా కోళ్ల హసీతా నాయుడు నామినేషన్ దాఖలు దుకాణాల అద్దె బకాయులు తక్షణమే చెల్లించాలి.. సంగాం శ్రీ సంగమేశ్వర స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు

సంగాం శ్రీ సంగమేశ్వర స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు

Select Suryaa Now
సంగాం శ్రీ సంగమేశ్వర స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు

​వంగర  సూర్య: పవిత్ర కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా విజయనగరం జిల్లా, వంగర మండలం, సంగాం గ్రామంలో పూర్వము బలరామస్వామితో ప్రతిష్టించిన సంగాం శ్రీ సంగమేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. తెల్లవారుజాము నుంచే పరిసర గ్రామాలతో పాటు,  శ్రీకాకుళం ఒరిస్సా జిల్లా ప్రాంతాల నుండి కూడా భక్తులు భారీ సంఖ్యలో తరలిరావడంతో ఆలయ ప్రాంగణమంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.
​సోమవారం వేకువజామునే భక్తులు త్రివేణి సంగమ తీరంలో (నాగావళి, సువర్ణముఖి, వేగావతి నదుల కలయిక ప్రాంతం) పవిత్ర స్నానాలు ఆచరించి, స్వామివారి దర్శనం కోసం క్యూలైన్లలో బారులు తీరారు. ఆలయ అర్చకులు స్వామివారికి తెల్లవారుజామున మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, బిల్వార్చన మరియు ప్రత్యేక పుష్పాలంకరణలు నిర్వహించారు.
​మహిళలు ఆలయ ప్రాంగణంలో, నదీ తీరంలో కార్తీక దీపాలను వెలిగించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఓం నమః శివాయ.హర హర మహాదేవ.అనే శివనామస్మరణతో సంగాం క్షేత్రం మార్మోగింది.
​ భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక క్యూలైన్లు, తాగునీటి సౌకర్యం కల్పించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వంగర పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
​మధ్యాహ్నం వరకు భక్తుల తాకిడి కొనసాగగా, ఆలయ నిర్వాహకులు భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.