ఖాసాపేట సర్పంచ్ అభ్యర్థిగా కోళ్ల హసీతా నాయుడు నామినేషన్ దాఖలు
ఎల్.కోట, సూర్య: లక్కవరపుకోట మండలం, ఖాసాపేట గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా కోళ్ల హసీతా నాయుడు ఎస్ కోట నియోజకవర్గం ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి కుమార్తె నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో సందడి వాతావరణం నెలకొంది. నామినేషన్ దాఖలు చేయడానికి ముందుగా, ఆమె ఖాసాపేట గ్రామంలోని శ్రీ రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భగవంతుని ఆశీస్సులు తీసుకున్న అనంతరం, గ్రామ పెద్దలు, మద్దతుదారులు మరియు స్థానిక నాయకులతో కలిసి భారీ ర్యాలీగా బయలుదేరారు. ర్యాలీ అనంతరం ఎల్.కోటలోని రిటర్నింగ్ అధికారి (RO) కార్యాలయానికి చేరుకున్న కోళ్ల హసీతా నాయుడు , ఎన్నికల అధికారులకు తన నామినేషన్ పత్రాలను అధికారికంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని ఆమెకు తమ సంపూర్ణ మద్దతు తెలిపారు.