పంచాయితీ ఎన్నికలకు నామినేషన్లు దాఖలు చేసిన కూటమి మద్దతుదారులు
- పాల్గొన్న ఎమ్మెల్యే బేబీనాయన
బొబ్బిలి,సూర్య: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 2026 మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల రెండో రోజు ప్రారంభమైంది. ఈ ఎన్నికల్లో అధికార కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ) మద్దతుదారులు సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు నామినేషన్లు దాఖలు చేశారు. బొబ్బిలి నియోజకవర్గంలో పలు పంచాయితీల అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియలో శాసనసభ్యులు ఆర్.వీ.ఎస్.కె.కె.రంగారావు (బేబీ నాయన) పాల్గొన్నారు.ఈ మేరకు మెట్టవలస, పారాది, దిబ్బగుడివలస, సీతయ్యపేట, కింతలవానిపేట, కోమటిపల్లి, ఎమ్.బూర్జవలస, నారాయణప్పవలస* పంచాయితీలకు సోమవారం నామినేషన్లు వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.