BREAKING
ఘనంగా 365 వోత్తుల దీపారాధన షార్జా టెస్టులో ఉత్కంఠ.. ఓటమి అంచున అఫ్గానిస్థాన్.. విజయానికి జింబాబ్వే అడుగు దూరంలో! 48 బంతుల్లోనే 135 పరుగుల సునామీ.. 12 ఏళ్ల ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన రజత్ పాటిదార్! జాతీయ కవి సమ్మేళనంలో లింగాల నరసింగరావుకు అరుదైన గౌరవం పంచాయితీ ఎన్నికలకు నామినేషన్లు దాఖలు చేసిన కూటమి మద్దతుదారులు ఏకగ్రీవం అభివృద్ధికి మార్గం..! మైదానంలో సంజూ శాంసన్ విశ్వరూపం.. 16 బంతుల్లోనే పరుగుల సునామీ.. మహారాష్ట్రపై కేరళ భారీ స్కోరు! పీఎం స్వన్నిధి అమలులో నగరపాలక సంస్థ కు అవార్డు... ఆయుర్వేద వైద్యంతో నిండైన ఆరోగ్యం కట్టంగూరు మండలంలోనీ ప్రజావాణికి నో రెస్పాన్స్..ఫిర్యాదులు లేక వెలవెలబోతున్న ప్రజావాణి! ఎల్.కోటలో జోరుగా నామినేషన్లు.. మేజర్ పంచాయతీలో నువ్వా నేనా! ఉపాధ్యాయుడు సామన్న దొర హత్య కేసులో నిందితులందరినీ అరెస్టు చేయాలి ఖాసాపేట సర్పంచ్ అభ్యర్థిగా కోళ్ల హసీతా నాయుడు నామినేషన్ దాఖలు దుకాణాల అద్దె బకాయులు తక్షణమే చెల్లించాలి.. సంగాం శ్రీ సంగమేశ్వర స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు

దుకాణాల అద్దె బకాయులు తక్షణమే చెల్లించాలి..

Select Suryaa Now
దుకాణాల అద్దె బకాయులు   తక్షణమే చెల్లించాలి..

 విజయనగరం సూర్య: నగరపాలక సంస్థ అధీనంలో ఉన్న దుకాణాల అద్దె బకాయిలను తక్షణమే చెల్లించాలని, లేకుంటే దుకాణాలను మూసివేయిస్తామని కమిషనర్ బాలస్వామి స్పష్టం చేశారు. ఆయన ఆదేశాలతో రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, సిబ్బంది బృందాలుగా ఏర్పాటై అద్దె మరియు ఆస్తిపన్ను బకాయిలను రాబడుతున్నారు. మొండి బకాయిదారులకు రెడ్ నోటీసులు అందిస్తున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ బాలస్వామి మాట్లాడుతూ నగరంలో ఆస్తి పన్నులు, కార్పొరేషన్ దుకాణాల అద్దెలను సకాలంలో చెల్లించి సంస్థకు సహకరించాల్సిందిగా కోరారు. అలాగే నీటి చార్జీలను కూడా చెల్లించాలన్నారు. ఇప్పటికే 7 కోట్ల 91 లక్షల మేర నీటి చార్జీలు బకాయిలు ఉన్నట్లు గణాంకాలు తెలియజేస్తున్నాయన్నారు. కావున నీటి వినియోగదారులు తక్షణమే నీటి చార్జీలను చెల్లించాలని చెప్పారు. లేదంటే కుళాయి కనెక్షన్లను తొలగించి వేస్తామని స్పష్టం చేశారు. దుకాణాల అద్దెలను వెంటనే చెల్లించాలని లేకుంటే రెడ్ నోటీసులు జారీ చేసి, తదుపరి దుకాణాలను మూసివేయిస్తామని వెల్లడించారు.