BREAKING
ఫుట్బాల్ టోర్నీలో విజేతగా ఎస్వీ ఆర్ట్స్ కళాశాల మహనీయుల చిత్రపటాలకు నివాళి ఓటీటీలోకి వచ్చేస్తున్న డీజే టిల్లు డైరెక్టర్ క్రేజీ కామెడీ మూవీ.. అనుమాన పక్షి స్ట్రీమింగ్ ఎక్కడంటే! మహిళా వర్సిటీకి ద్వితీయ బహుమతి ఘనంగా 365 వోత్తుల దీపారాధన షార్జా టెస్టులో ఉత్కంఠ.. ఓటమి అంచున అఫ్గానిస్థాన్.. విజయానికి జింబాబ్వే అడుగు దూరంలో! 48 బంతుల్లోనే 135 పరుగుల సునామీ.. 12 ఏళ్ల ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన రజత్ పాటిదార్! జాతీయ కవి సమ్మేళనంలో లింగాల నరసింగరావుకు అరుదైన గౌరవం పంచాయితీ ఎన్నికలకు నామినేషన్లు దాఖలు చేసిన కూటమి మద్దతుదారులు ఏకగ్రీవం అభివృద్ధికి మార్గం..! మైదానంలో సంజూ శాంసన్ విశ్వరూపం.. 16 బంతుల్లోనే పరుగుల సునామీ.. మహారాష్ట్రపై కేరళ భారీ స్కోరు! పీఎం స్వన్నిధి అమలులో నగరపాలక సంస్థ కు అవార్డు... ఆయుర్వేద వైద్యంతో నిండైన ఆరోగ్యం కట్టంగూరు మండలంలోనీ ప్రజావాణికి నో రెస్పాన్స్..ఫిర్యాదులు లేక వెలవెలబోతున్న ప్రజావాణి! ఎల్.కోటలో జోరుగా నామినేషన్లు.. మేజర్ పంచాయతీలో నువ్వా నేనా!

జాతీయ కవి సమ్మేళనంలో లింగాల నరసింగరావుకు అరుదైన గౌరవం

Select Suryaa Now
జాతీయ కవి సమ్మేళనంలో లింగాల నరసింగరావుకు అరుదైన గౌరవం
  • కలం కన్నీరు పెడుతోంది’ కవితకు విశేష గుర్తింపు.. ఘనంగా సత్కారం

విజయనగరం సూర్య: జాతీయ స్థాయిలో నిర్వహించిన కవి సమ్మేళనంలో సీనియర్ జర్నలిస్ట్ లింగాల నరసింగరావుకు అరుదైన గౌరవం లభించింది. ఆయన రచించిన ‘కలం కన్నీరు పెడుతోంది’ కవితకు విశేష గుర్తింపు లభించడంతో నిర్వాహకులు ఘనంగా సత్కరించారు.విజయనగరం జిల్లా కేంద్రంలోని గురజాడ పాఠశాల ఆడిటోరియంలో శ్రీశ్రీ కళావేదిక, తెలుగు భాషా పరిరక్షణ సమితి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ‘విజయనగర సాహితీ వైభవం’ జాతీయ సాహిత్య, సంగీత, సాంస్కృతిక మహోత్సవంలో ఈ గౌరవం దక్కింది. శ్రీశ్రీ కళావేదిక 177వ సమావేశంలో భాగంగా నిర్వహించిన జాతీయ కవి సమ్మేళనంలో నరసింగరావు తన కవితను వినిపించారు. సమాజంలోని పరిస్థితులు, పాత్రికేయ రంగంలోని భావోద్వేగాలను ప్రతిబింబించేలా సాగిన ఈ కవితకు మంచి స్పందన లభించింది. ఈ సందర్భంగా నిర్వాహకులు లింగాల నరసింగరావును శాలువాతో సత్కరించి అభినందించారు.ఈ కార్యక్రమంలో శ్రీశ్రీ కళావేదిక అంతర్జాతీయ చైర్మన్ కత్తిమండ ప్రతాప్ కుమార్, జాతీయ అధ్యక్షురాలు బి. ఈశ్వరీ భూషణం, జాతీయ ప్రణాళిక సభ్యురాలు డాక్టర్ టి. పర్వతరెడ్డి, ఉత్తరాంధ్ర కన్వీనర్ డాక్టర్ డబ్బీరు గోవిందరావు, విజయనగరం జిల్లా కన్వీనర్ సముద్రాల గురుప్రసాద్, జిల్లా అధ్యక్షుడు గొర్లె సీతారామమూర్తి, గౌరవ సలహాదారు డాక్టర్ స్వప్న హైందవి  , ప్రధాన కార్యదర్శి సాలూరు సంతోషిని, కార్యదర్శి మానాప్రగడ సాహితి, సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు ఈపు విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు.