ఫుట్బాల్ టోర్నీలో విజేతగా ఎస్వీ ఆర్ట్స్ కళాశాల
ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : ఎస్వీయూ అంతర్ కళాశాలల ఫుట్బాల్ టోర్నమెంట్లో భాగంగా ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలో జరిగిన పోటీలలో ఆ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరచి విజేతలుగా నిలిచారు. సుమారు 8 కళాశాలలకు చెందిన జట్టు పాల్గొన్న ఈ టోర్నమెంట్ సోమవారం పోటాపోటీగా కొనసాగింది. విజేతలుగా నిలిచిన ఎస్వీ ఆర్ట్స్ కళాశాల జట్టుకు ఎస్వీయూ ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రొఫెసర్ ఎం శివశంకర్ రెడ్డి, ఎస్వీ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కిషన్, పీడీ డాక్టర్ ఎస్ ముస్తాక్ అహ్మద్ బహుమతులను, ట్రోఫీని అందజేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ మల్లికార్జునరావు, అధ్యాపకులు డాక్టర్ కిరణ్ కుమార్, డాక్టర్ ప్రసాద్, విద్యార్థులు పాల్గొన్నారు.
సీఎం గౌడ్ తిరుపతి స్టాఫ్ రిపోర్టర్