BREAKING
విద్యార్థుల భద్రతే లక్ష్యం.. -జిల్లాలోని పలు పాఠశాలలలో శక్తి బృందం అవగాహన టెక్ షేర్ల పతనంతో కుదేలైన అమెరికా మార్కెట్లు: 1.5% నష్టపోయిన నాస్‌డాక్! కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రంలో మొదటి సోమవారం..... కోటి...... సోమవారాలతో సమానం.... రష్యాపై ఈయూ మరో విడత ఆంక్షలు: 145 మంది వ్యక్తులు, సంస్థల జాబితా! రాష్ట్రస్థాయి పోటీలకు విద్యార్థులు ఎంపిక కేతేపల్లి ఎస్ఐగా ఎం. రవికుమార్ బాధ్యతల స్వీకరణ ఘనంగా ఉద్యమకారుల దినోత్సవం కాప్‌31 ముసాయిదా విడుదల: శిలాజ ఇంధనాల వినియోగంపై దేశాల మధ్య ఏకాభిప్రాయ లోపం! కిమ్ జోంగ్ ఉన్‌తో భేటీపై ట్రంప్ సంకేతాలు: చైనా వేదికగా సమావేశం అయ్యే అవకాశం! కార్తీకోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు కడుపుబ్బా నవ్విస్తూనే వెన్నులో వణుకు పుట్టించేందుకు సిద్ధమైన భూతం ప్రేతం.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే! ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వాలి ట్రంప్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ: పరిశోధన గ్రాంట్ల నిలిపివేతపై అప్పీల్ తిరస్కరణ! అంగరంగ వైభవంగా తేజ సజ్జా - మౌర్యల నిశ్చితార్థం.. కాబోయే జంటను ఆశీర్వదించిన వేమూరి రాధాకృష్ణ! ఫుట్బాల్ టోర్నీలో విజేతగా ఎస్వీ ఆర్ట్స్ కళాశాల

ఘనంగా ఉద్యమకారుల దినోత్సవం

Select Suryaa Now
ఘనంగా ఉద్యమకారుల దినోత్సవం

ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : జాతీయ గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా తిరుపతిలోని ప్రథమ శ్రేణి శాఖ గ్రంథాలయంలో గ్రంథాలయ ఉద్యమకారుల దినోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించారు.గ్రంథాలయాధికారి ఎం.ధనంజయులు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి నడ్డి నారాయణ అధ్యక్షత వహించగా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల సీనియర్ లైబ్రేరియన్  నటరాజన్ నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ గ్రంథాలయ ఉద్యమ పితామహులు గాడిచర్ల హరిసర్వోత్తమ రావు, అయ్యంకి వెంకటరమణయ్య చిత్రపటాలకు అతిథులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో వక్తలు మాట్లాడుతూ గ్రంథాలయాలు కేవలం పుస్తక భాండాగారాలు మాత్రమే కాదని, అవి సమాజ చైతన్యానికి, విజ్ఞాన వికాసానికి ప్రజా విశ్వవిద్యాలయాలుగా పనిచేస్తాయని పేర్కొన్నారు. గ్రంథాలయ ఉద్యమకారుల త్యాగాలను నేటి తరం స్ఫూర్తిగా తీసుకుని పఠనాసక్తిని పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథులుగా రిటైర్డ్ అసిస్టెంట్ ఇంగ్లీష్ ప్రొఫెసర్ డాక్టర్ గోపాల్, సామాజిక కార్యకర్త మునిలక్ష్మి, చంద్రగిరి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల జూనియర్ లైబ్రేరియన్ మోహన్, జనవిజ్ఞాన వేదిక ప్రతినిధి రెడ్డప్ప, సినీ రచయిత గౌస్ బాషా పాల్గొని ప్రసంగించారు. కార్యక్రమంలో గ్రంథాలయ సిబ్బంది, పాఠకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

సీఎం గౌడ్ తిరుపతి స్టాఫ్ రిపోర్టర్