BREAKING
24న యోగుల పర్వతంపై కార్తీక దీపోత్సవం వాగ్దానాల వర్షం.. అమలులో కరువు!"* *రైతు బతుకు బాగుపడేదెప్పుడు? హామీలు నెరవేరేదెప్పుడు? స్విట్జర్లాండ్ ఫ్యామిలీ ఆఫీసులకు కొత్త నిబంధనలు: స్వచ్ఛంద నియమావళి! రాష్ట్ర గర్ల్స్ కన్వెన్షన్ ను జయప్రదం చేయండి జర్మనీలో టెస్లా భారీ విస్తరణ: రూ.27 వేల కోట్లకు పైగా పెట్టుబడుల ప్రణాళిక! ప్రజావాణి అర్జీల పరిష్కారంలో జాప్యం వద్దు:కలెక్టర్ అనురాగ్ జయంతి* *-147 దరఖాస్తుల స్వీకరణ అమెరికా విమానయాన రంగానికి భారీ ఎదురుదెబ్బ: రూ.2,900 కోట్లకు పైగా ఆదాయ నష్టం! వ్యక్తిత్వ వికాసం, ఉపాధి అవకాశాలపై అవగాహన ఫారెక్స్ మార్కెట్ల పనితీరు బలంగా ఉంది: న్యూయార్క్ ఫెడ్ అధికారి వెల్లడి! రైతులు ఐకేపీ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి విద్యార్థుల భద్రతే లక్ష్యం.. -జిల్లాలోని పలు పాఠశాలలలో శక్తి బృందం అవగాహన టెక్ షేర్ల పతనంతో కుదేలైన అమెరికా మార్కెట్లు: 1.5% నష్టపోయిన నాస్‌డాక్! కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రంలో మొదటి సోమవారం..... కోటి...... సోమవారాలతో సమానం.... రష్యాపై ఈయూ మరో విడత ఆంక్షలు: 145 మంది వ్యక్తులు, సంస్థల జాబితా! రాష్ట్రస్థాయి పోటీలకు విద్యార్థులు ఎంపిక

విద్యార్థుల భద్రతే లక్ష్యం.. -జిల్లాలోని పలు పాఠశాలలలో శక్తి బృందం అవగాహన

Select Suryaa Now
విద్యార్థుల భద్రతే లక్ష్యం.. -జిల్లాలోని పలు పాఠశాలలలో శక్తి బృందం అవగాహన

ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : విద్యార్థుల భద్రత, బాలల హక్కుల పరిరక్షణే లక్ష్యంగా జిల్లాలోని పలు పాఠశాలల్లో శక్తి బృందం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ ఎల్.సుబ్బరాయుడు ఆదేశాల మేరకు సోమవారం శక్తి బృందం చెర్లోపల్లిలోని జెడ్.పి.ఉన్నత పాఠశాల, సి.మల్లవరం, ఎం.పి.పి. పాఠశాల విద్యార్థులకు గుడ్ టచ్-బ్యాడ్ టచ్, బాల కార్మిక వ్యవస్థ, బాలలపై వేధింపులు, బాలల అదృశ్యం, కిడ్నాప్ వంటి అంశాలపై అవగాహన కల్పించారు. అలాగే క్రమశిక్షణ, నైతిక విలువలు, మంచి అలవాట్లు, వ్యక్తిత్వ వికాసం, విద్య ప్రాముఖ్యతపై వివరించారు. తమకు ఎదురయ్యే సమస్యలను భయపడకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా పోలీసుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు.పోలీసుల టోల్ ఫ్రీ నంబర్ 112, బాలల రక్షణ కోసం చైల్డ్ హెల్ప్ లైన్ 1098తో పాటు పోలీస్ అత్యవసర సేవల నంబర్ల గురించి వివరించారు. బాలల్లో చిన్న వయస్సు నుంచే ఆత్మవిశ్వాసం, అప్రమత్తత పెంపొందించడమే ఈ కార్యక్రమాల లక్ష్యమని శక్తి బృందం సభ్యులు పేర్కొన్నారు.

సీఎం గౌడ్ తిరుపతి స్టాప్ రిపోర్టర్