24న యోగుల పర్వతంపై కార్తీక దీపోత్సవం
ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ :కార్తీక పౌర్ణమి నాడు రామచంద్రాపురం మండలంలోనున్న యోగుల పర్వంతంపై ఈ నెల 24న కార్తీక దీపోత్సవం అత్యంత వేడుకగా నిర్వహిస్తున్నట్లు ఏకవీర సేవా ఫౌండేషన వ్యవస్థాపకుడు ప్రతాప్ స్వామి తెలిపారు. ఈమేరకు సోమవారం గంగమ్మ గుడి సమీపంలోని నేరేళ్లమ్మ ఆలయం వద్ద కార్తీక దీపోత్సవానికి సంబంధించిన ఆహ్వాన పత్రికలను రంగస్థలి చైర్మన్ గోపినాథ్ రెడ్డితో కలసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఏటా కార్తీక పౌర్ణమి నాడు కన్నుల పండుగా ఈ కార్తీక దీపోత్సవం చేపడుతున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా 24న 1008 కిలోల ఆవు నెయ్యి, 1503 మీటర్ల వొత్తితో 6 అడుగుల కొప్పెరతో కార్తీక దీపోత్సవం వైభవంగా నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్తీక దీపోత్సవానికి ప్రజలందరూ తరలిరావాలని ఆయన పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో సభ్యులు కార్యదర్శి కేఎన్.రాజా, సుబ్రమణ్యంరెడ్డి, కల్యాణి, చిత్రపు హనుమంతరావు, బాస్కర్ రెడ్డి ఆర్ఎంఎస్.బాస్కర్, సురేష్ స్వామి పాల్గొన్నారు.
సీఎం గౌడ్ తిరుపతి స్టాఫ్ రిపోర్టర్