రాష్ట్ర గర్ల్స్ కన్వెన్షన్ ను జయప్రదం చేయండి
ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : భారత విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో డిసెంబర్ 12, 13 తేదీల్లో తిరుపతి వేదికగా నిర్వహించే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గర్ల్స్ కన్వెన్షన్ ను జయప్రదం చేయాలని ఎస్ఎఫ్ఐ నేతలు పిలుపునిచ్చారు. ఈ మేరకు సోమవారం రాష్ట్ర గర్ల్స్ కన్వెన్షన్ కు సంబంధించిన లోగోను జిల్లా జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ తిరుపతి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పవిత్ర, అక్బర్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థినులు ఎదుర్కొంటున్న విద్యాపరమైన సమస్యలు, మహిళలపై పెరుగుతున్న దాడులు, విద్యాసంస్థల్లో భద్రతా లోపాలు, హాస్టళ్లలో మౌలిక సదుపాయాల కొరత వంటి అంశాలపై కన్వెన్షన్ లో విస్తృతంగా చర్చించనున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 300 మంది విద్యార్థినులు హాజరవుతారని తెలిపారు. తిరుపతి నగర విద్యార్థినులు, ప్రజాస్వామ్యవాదులు పెద్ద సంఖ్యలో పాల్గొని కన్వెన్షన్ ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శులు లతీఫ్, తేజ, సునీత, అనిత, యూనివర్సిటీ కమిటీ సభ్యులు లావణ్య, మేఘన, నవ్య, దీపిక పాల్గొన్నారు.
సీఎం గౌడ్ తిరుపతి స్టాఫ్ రిపోర్టర్