ప్రజావాణి అర్జీల పరిష్కారంలో జాప్యం వద్దు:కలెక్టర్ అనురాగ్ జయంతి* *-147 దరఖాస్తుల స్వీకరణ
*-బాలల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రజావాణి*
*యాదాద్రి ప్రతినిధి మేజర్ న్యూస్*
ప్రజావాణిలో అందిన అర్జీలను పెండింగ్‌లో ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వెంకా రెడ్డితో కలిసి ప్రజల నుంచి 147 దరఖాస్తులను స్వీకరించారు. ప్రతి అర్జీని క్షేత్రస్థాయిలో పరిశీలించి ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు.తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఆధ్వర్యంలో బాలల హక్కుల వారోత్సవాల్లో భాగంగా సాధారణ ప్రజావాణితోపాటు బాలల ప్రత్యేక ప్రజావాణిని ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. పిల్లల హక్కుల పరిరక్షణ, వారి సమస్యల పరిష్కారానికి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.వచ్చిన దరఖాస్తుల్లో రెవెన్యూ శాఖకు 71, మండల పరిషత్‌కు 17, గ్రామీణాభివృద్ధి శాఖకు 11, సంక్షేమ శాఖకు 8, సర్వే అండ్ ల్యాండ్స్, మున్సిపాలిటీలకు ఏడేసి, విద్యాశాఖకు 5, గృహ నిర్మాణం, ఉపాధి కల్పన శాఖలకు నాలుగేసి, నీటిపారుదల శాఖకు 3, వైద్యారోగ్య శాఖ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కార్యాలయాలకు రెండేసి వచ్చాయి. ఎల్‌డీఎం, జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, ఎస్సీ, బీసీ సంక్షేమం, సమాచార, ఆర్టీసీ శాఖలకు ఒక్కో అర్జీ అందింది.కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంక రెడ్డి,జిల్లా రెవెన్యూ అధికారి జయమ్మ, జడ్పీ సీఈఓ శోభారాణి, హౌసింగ్ పీడీ అలివేలు, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్‌రెడ్డి, డిప్యూటీ సీఈఓ శ్రీనివాస్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.