BREAKING
ధాన్యంకొనుగోళ్లలోరైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు wa పృథ్వీరెడ్డికి కేంద్ర మంత్రి ఆశీస్సులు ముగిసిన పాదయాత్ర.. కేసీఆర్‌ను కలిసిన మల్లేష్ బృందం! పాదయాత్ర బృందానికి కేసీఆర్ అభినందనలు నా అడ్డ తుంగతుర్తి.. నా గడ్డ తుంగతుర్తి.. నా పోరాటం తుంగతుర్తి కోసమే" చేయూత పెన్షన్ మంజూరి పత్రముల పంపిణీ కార్యక్రమములో ఎమ్మెల్యే మందుల సామేల్ 24న యోగుల పర్వతంపై కార్తీక దీపోత్సవం వాగ్దానాల వర్షం.. అమలులో కరువు!"* *రైతు బతుకు బాగుపడేదెప్పుడు? హామీలు నెరవేరేదెప్పుడు? స్విట్జర్లాండ్ ఫ్యామిలీ ఆఫీసులకు కొత్త నిబంధనలు: స్వచ్ఛంద నియమావళి! రాష్ట్ర గర్ల్స్ కన్వెన్షన్ ను జయప్రదం చేయండి జర్మనీలో టెస్లా భారీ విస్తరణ: రూ.27 వేల కోట్లకు పైగా పెట్టుబడుల ప్రణాళిక! ప్రజావాణి అర్జీల పరిష్కారంలో జాప్యం వద్దు:కలెక్టర్ అనురాగ్ జయంతి* *-147 దరఖాస్తుల స్వీకరణ అమెరికా విమానయాన రంగానికి భారీ ఎదురుదెబ్బ: రూ.2,900 కోట్లకు పైగా ఆదాయ నష్టం! వ్యక్తిత్వ వికాసం, ఉపాధి అవకాశాలపై అవగాహన ఫారెక్స్ మార్కెట్ల పనితీరు బలంగా ఉంది: న్యూయార్క్ ఫెడ్ అధికారి వెల్లడి! రైతులు ఐకేపీ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి విద్యార్థుల భద్రతే లక్ష్యం.. -జిల్లాలోని పలు పాఠశాలలలో శక్తి బృందం అవగాహన

వ్యక్తిత్వ వికాసం, ఉపాధి అవకాశాలపై అవగాహన

Select Suryaa Now
వ్యక్తిత్వ వికాసం, ఉపాధి అవకాశాలపై అవగాహన

ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : పద్మావతి మహిళా డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో వ్యక్తిత్వ వికాసం, ఉపాధి అవకాశాలపై అవగాహన కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం, సెట్విన్, కౌటిల్య సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించారు. సోమవారం జరిగినఈ కార్యక్రమానికి కళాశాల వైస్ ప్రిన్సిపల్ కె. సాయికుమారి అధ్యక్షత వహించారు. ఆమె మాట్లాడుతూ ఇలాంటి అవగాహన కార్యక్రమాల ద్వారా విద్యార్థినులు ఉద్యోగ, ఉపాధి అవకాశాల మెలకువలను పెంపొందించుకుంటారని, మొబైల్స్ ను కెరీర్ డెవలప్ మెంట్ కోసం వినియోగించాలని తెలిపారు.ముఖ్య వక్తగా సెట్విన్ మేనేజర్ మోహన్ కుమార్ మాట్లాడుతూ వ్యక్తిలో దాగి ఉన్న శక్తులను, నైపుణ్యాలను సానుకూల ధోరణిలో మెరుగుపరుచుకుంటే పరిపూర్ణ వ్యక్తిగా ఎదగవచ్చని, కమ్యూనికేషన్ స్కిల్స్ అభివృద్ధి చేసుకుంటే లక్ష్యాన్ని సులభంగా చేరుకోవచ్చని పిలుపునిచ్చారు. కౌటిల్య సంస్థ సీనియర్ మేనేజర్ ఎన్.ఎస్.రెడ్డి మాట్లాడుతూ గ్రూప్-1, గ్రూప్-2, ఎస్బీఐ, ఆర్బీఐ, ఐబీపీఎస్ బ్యాంకుల్లో పీఓ, క్లర్క్ ఉద్యోగాలు పొందాలంటే ప్రణాళికాబద్ధంగా సిలబస్ పై పట్టు సాధించాలన్నారు. కాలం చాలా విలువైనదని, వృథా చేయకుండా ఇప్పటి నుంచే పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని, ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఏపీపీఎస్సీ వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్  చేసుకోవాలని సూచించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఎలా ఉపయోగించాలో వివరించారు. తెలుగు విభాగాధిపతి డా. బి. కృష్ణవేణి మాట్లాడుతూ భవిష్యత్తులో ఉపాధి అవకాశాలకు ఈ కార్యక్రమం సరైన మార్గదర్శకత్వం ఇస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో డా.ఎల్.కస్తూరి, డా.బి. ఉమామహేశ్వరి, డా.కె.విజయ్ కుమారి, విద్యార్థినులు పాల్గొన్నారు.

సీఎం గౌడ్ తిరుపతి స్టాప్ రిపోర్టర్