రాష్ట్రస్థాయి పోటీలకు విద్యార్థులు ఎంపిక
ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : 70వ ఎస్ జీ ఎఫ్ అండర్-19 బాల బాలికల విభాగంలో అక్టోబర్ లో జరిగిన ఫుట్ బాల్ పోటీల్ల పద్మావతి మహిళా జూనియర్ కళాశాల విద్యార్థులు జిల్లా స్థాయిలో గెలుపొంది రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారని కళాశాల ప్రిన్సిపల్ డా. భువనేశ్వరి వెల్లడించారు. ఈ సందర్భంగా సోమవారం విజేతలగా నిలిచిన ఇ.దేవిక, కె.శ్రీహర్ష,పి.అనూష, యు.హారిక, ఎన్.హేమశ్రీ, జి.విష్ణుప్రియ విద్యార్థులను ప్రిన్సిపల్ అభినందించారు. జిల్లాలో విజయం సాధించిన వీరు నంబర్ 21 నుంచి 23 వరకు పుత్తూరులో జరిగే రాష్ట్రస్థాయి ఫుట్ బాల్ పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. రాష్ట్ర స్థాయిలో కూడా రాణించి కళాశాలకు, టీటీడీకి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ఆమె విద్యార్థులను ప్రోత్సహించారు. పీడీ సాయిసమతి, అధ్యాపకులు పాల్గొని క్రీడాకారులను ఉత్తేజపరిచారు.
సీఎం గౌడ్ తిరుపతి స్టాప్ రిపోర్టర్