BREAKING
కేతేపల్లి ఎస్ఐగా ఎం. రవికుమార్ బాధ్యతల స్వీకరణ ఘనంగా ఉద్యమకారుల దినోత్సవం కాప్‌31 ముసాయిదా విడుదల: శిలాజ ఇంధనాల వినియోగంపై దేశాల మధ్య ఏకాభిప్రాయ లోపం! కిమ్ జోంగ్ ఉన్‌తో భేటీపై ట్రంప్ సంకేతాలు: చైనా వేదికగా సమావేశం అయ్యే అవకాశం! కార్తీకోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు కడుపుబ్బా నవ్విస్తూనే వెన్నులో వణుకు పుట్టించేందుకు సిద్ధమైన భూతం ప్రేతం.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే! ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వాలి ట్రంప్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ: పరిశోధన గ్రాంట్ల నిలిపివేతపై అప్పీల్ తిరస్కరణ! అంగరంగ వైభవంగా తేజ సజ్జా - మౌర్యల నిశ్చితార్థం.. కాబోయే జంటను ఆశీర్వదించిన వేమూరి రాధాకృష్ణ! ఫుట్బాల్ టోర్నీలో విజేతగా ఎస్వీ ఆర్ట్స్ కళాశాల మహనీయుల చిత్రపటాలకు నివాళి ఓటీటీలోకి వచ్చేస్తున్న డీజే టిల్లు డైరెక్టర్ క్రేజీ కామెడీ మూవీ.. అనుమాన పక్షి స్ట్రీమింగ్ ఎక్కడంటే! మహిళా వర్సిటీకి ద్వితీయ బహుమతి ఘనంగా 365 వోత్తుల దీపారాధన షార్జా టెస్టులో ఉత్కంఠ.. ఓటమి అంచున అఫ్గానిస్థాన్.. విజయానికి జింబాబ్వే అడుగు దూరంలో!

మహిళా వర్సిటీకి ద్వితీయ బహుమతి

Select Suryaa Now
మహిళా వర్సిటీకి ద్వితీయ బహుమతి

ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, బయోసైన్సెస్, సెరికల్చర్ విభాగం విద్యార్థులు అన్వేషన్-2026 విద్యార్థుల పరిశోధనా సదస్సులో విశేష ప్రతిభ కనబరిచి బేసిక్ సైన్సెస్ విభాగంలో ద్వితీయ బహుమతి సాధించి వర్సిటీకి కీర్తి ప్రతిష్ఠలు తీసుకొచ్చారు.ఈ పరిశోధనా సదస్సు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నిర్వహించబడింది. ఈ పోటీలలో కుమారి ఐశ్వర్య, కుమారి ప్రసల్య, కుమారి పూజ, కుమారి ఎస్.కె.రజీఫ్ తమ వినూత్న పరిశోధనా ఆవిష్కరణ "బయోడిగ్రేడబుల్ మల్టీఫంక్షనల్ మల్చ్" కు ద్వితీయ బహుమతి సాధించారు.ఈ ఆవిష్కరణ పర్యావరణహిత వ్యవసాయ పరిష్కారంగా రైతులకు ఎంతో ఉపయోగకరం. నేలలో తేమను కాపాడటం, కలుపు మొక్కల పెరుగుదలను నియంత్రించడం, నేల ఉష్ణోగ్రతను సమతుల్యం చేయడం సాంప్రదాయ ప్లాస్టిక్ మల్చ్ వినియోగాన్ని తగ్గించడం ద్వారా స్థిరమైన వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహిస్తుంది. ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల కలిగే పర్యావరణ సమస్యలను తగ్గించడంలో తోడ్పడుతుంది. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఉమా, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఉష, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డైరెక్టర్ ప్రొఫెసర్ వాణి, అన్వేషణ-26 యూనివర్సిటీ లెవల్ కోఆర్డినేటర్లు ప్రొఫెసర్ జాన్ సుష్మా, డా. ఇందిర, సెరికల్చర్ అధ్యాపకులు విద్యార్థులను అభినందించారు.

సీఎం గౌడ్ తిరుపతి స్టాఫ్ రిపోర్టర్