కేతేపల్లి ఎస్ఐగా ఎం. రవికుమార్ బాధ్యతల స్వీకరణ
కట్టంగూర్ మేజర్ న్యూస్
కేతేపల్లి పోలీస్ స్టేషన్ నూతన ఎస్ఐగా ఎం. రవికుమార్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ సిబ్బంది ఆయనకు స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఎస్ఐ ఎం. రవికుమార్ మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తానని, ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ప్రజలు చట్టాలను గౌరవిస్తూ పోలీసులకు సహకరించాలని కోరారు.