మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలిగా రేణుక సిద్దిపేట జిల్లా మహిళా కాంగ్రెస్ పగ్గాలు అడ్వకేట్ గడ్డం రేణుకకు
సిద్దిపేట అర్బన్, : జిల్లా మహిళా కాంగ్రెస్‌కు నూతన అధ్యక్షురాలిగా అడ్వకేట్ గడ్డం అలియాస్ తౌడబోయిన రేణుక నియమితులయ్యారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ఆమె నియామకాన్ని ఖరారు చేసింది.గురువారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో జాతీయ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆల్కా లాంబా, తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ చేతుల మీదుగా రేణుక నియామక ఉత్తర్వులను అందుకున్నారు.ఈ సందర్భంగా రేణుక మాట్లాడుతూ తనపై నమ్మకంతో జిల్లా స్థాయిలో కీలక బాధ్యతలు అప్పగించిన పార్టీ జాతీయ, రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ జిల్లాలో మహిళా కాంగ్రెస్‌ను క్షేత్రస్థాయిలో బలోపేతం చేస్తానన్నారు. మహిళల హక్కుల పరిరక్షణ, సాధికారతతో పాటు వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని స్పష్టం చేశారు.కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను, ప్రజా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ పార్టీ అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తానని తెలిపారు. తన నియామకానికి సహకరించిన జాతీయ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆల్కా లాంబా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌తో పాటు స్థానిక కాంగ్రెస్ నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
రేణుక నియామకంపై జిల్లా కాంగ్రెస్ శ్రేణుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఆమె నాయకత్వంలో జిల్లాలో మహిళా కాంగ్రెస్ కార్యకలాపాలు మరింత విస్తరించడంతో పాటు మహిళా సమస్యలపై పార్టీ కార్యక్రమాలు చురుగ్గా సాగుతాయని నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.