BREAKING
కేతేపల్లి ఎస్ఐగా ఎం. రవికుమార్ బాధ్యతల స్వీకరణ ఘనంగా ఉద్యమకారుల దినోత్సవం కాప్‌31 ముసాయిదా విడుదల: శిలాజ ఇంధనాల వినియోగంపై దేశాల మధ్య ఏకాభిప్రాయ లోపం! కిమ్ జోంగ్ ఉన్‌తో భేటీపై ట్రంప్ సంకేతాలు: చైనా వేదికగా సమావేశం అయ్యే అవకాశం! కార్తీకోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు కడుపుబ్బా నవ్విస్తూనే వెన్నులో వణుకు పుట్టించేందుకు సిద్ధమైన భూతం ప్రేతం.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే! ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వాలి ట్రంప్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ: పరిశోధన గ్రాంట్ల నిలిపివేతపై అప్పీల్ తిరస్కరణ! అంగరంగ వైభవంగా తేజ సజ్జా - మౌర్యల నిశ్చితార్థం.. కాబోయే జంటను ఆశీర్వదించిన వేమూరి రాధాకృష్ణ! ఫుట్బాల్ టోర్నీలో విజేతగా ఎస్వీ ఆర్ట్స్ కళాశాల మహనీయుల చిత్రపటాలకు నివాళి ఓటీటీలోకి వచ్చేస్తున్న డీజే టిల్లు డైరెక్టర్ క్రేజీ కామెడీ మూవీ.. అనుమాన పక్షి స్ట్రీమింగ్ ఎక్కడంటే! మహిళా వర్సిటీకి ద్వితీయ బహుమతి ఘనంగా 365 వోత్తుల దీపారాధన షార్జా టెస్టులో ఉత్కంఠ.. ఓటమి అంచున అఫ్గానిస్థాన్.. విజయానికి జింబాబ్వే అడుగు దూరంలో!

అంగరంగ వైభవంగా తేజ సజ్జా - మౌర్యల నిశ్చితార్థం.. కాబోయే జంటను ఆశీర్వదించిన వేమూరి రాధాకృష్ణ!

Select Suryaa Now
అంగరంగ వైభవంగా తేజ సజ్జా - మౌర్యల నిశ్చితార్థం.. కాబోయే జంటను ఆశీర్వదించిన వేమూరి రాధాకృష్ణ!

సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా తన జీవితంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. అమెరికాలో స్థిరపడిన వ్యాపార కుటుంబానికి చెందిన మౌర్యతో తేజ సజ్జా నిశ్చితార్థం సోమవారం హైదరాబాద్‌లో అత్యంత వైభవంగా జరిగింది. ఇరు కుటుంబాల పెద్దలు కుదిర్చిన ఈ వివాహ వేడుకకు సినీ, రాజకీయ, మీడియా రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరై కాబోయే దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రముఖ మీడియా సంస్థల చైర్మన్ వేమూరి రాధాకృష్ణ ఈ వేడుకలో ప్రత్యేకంగా పాల్గొని తేజ సజ్జా, మౌర్యలకు ఆశీస్సులు అందించారు.

ఈ నిశ్చితార్థ వేడుకకు రాజకీయ ప్రముఖుల తాకిడి ఎక్కువగా కనిపించింది. తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీతక్క, మాజీ మంత్రి హరీశ్ రావు, ఏపీ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తదితరులు విచ్చేసి నూతన జంటను ఆశీర్వదించారు. అటు మెగాస్టార్ చిరంజీవి వేడుకకు హాజరుకావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పలువురు ప్రముఖులు ఒకే వేదికపై కలవడంతో నిశ్చితార్థ ప్రాంగణమంతా కోలాహలంగా మారింది.

తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి అగ్ర నిర్మాతలు, స్టార్ హీరోలు, దర్శకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. లెజెండరీ దర్శకుడు కె. రాఘవేంద్రరావుతో పాటు నిర్మాతలు అల్లు అరవింద్, సురేష్ బాబు, దిల్ రాజు, టీజీ విశ్వప్రసాద్, సుస్మిత కొణిదెల, సాహు గారపాటి, వెంకట్ బోయనపల్లి సందడి చేశారు. హీరోలు రవితేజ, నాని, రానా దగ్గుబాటి, శ్రీకాంత్, అడివి శేష్, సుధీర్ బాబు, కథానాయికలు వరలక్ష్మి శరత్‌కుమార్, నిధి అగర్వాల్, నిహారిక కొణిదెల, రితికా నాయక్, ఇమాన్వి తదితరులు హాజరై తేజ సజ్జాకు అభినందనలు తెలిపారు.

దర్శకుల విభాగం నుంచి బి. గోపాల్, అనిల్ రావిపూడి, ప్రశాంత్ వర్మ, శివ నిర్వాణ, నందినీ రెడ్డి, కార్తీక్ ఘట్టమనేని, మారుతి, చందూ మొండేటి, శైలేష్ కొలను, బీవీఎస్ రవి తదితరులు విచ్చేసి కాబోయే జంటకు శుభాకాంక్షలు అందజేశారు. బాలనటుడిగా కెరీర్ ప్రారంభించి హనుమాన్, మిరాయ్ వంటి సినిమాలతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న తేజ సజ్జా, వచ్చే నెల డిసెంబర్‌లో రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ ద్వారా మౌర్య మెడలో మూడు ముళ్లు వేయనున్నారు.