ఘనంగా తేజ సజ్జా, మౌర్యల నిశ్చితార్థం.. తళుక్కుమన్న సినీ, రాజకీయ ప్రముఖులు!
సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: హను-మాన్ చిత్రంతో దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్ యువ హీరో తేజ సజ్జా తన జీవితంలో కొత్త అధ్యాయానికి నాంది పలికారు. సోమవారం హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని తాజ్ కృష్ణా హోటల్‌లో మౌర్యతో తేజ సజ్జా నిశ్చితార్థ వేడుక అత్యంత వైభవంగా జరిగింది. ఇరు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులతో పాటు సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొని కాబోయే జంటను ఆశీర్వదించారు. నిశ్చితార్థ వేడుకకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి.
ఈ వేడుకలో లేత గులాబీ రంగు ఫ్లోరల్ జాకెట్‌తో కూడిన సంప్రదాయ కుర్తాలో తేజ సజ్జా, ఆకుపచ్చ రంగు డిజైనర్ లెహంగాలో మౌర్య ఎంతో అందంగా కనిపిస్తూ ఉంగరాలు మార్చుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా హాజరై తేజ సజ్జా, మౌర్యలకు శుభాకాంక్షలు తెలిపారు. వీరితో పాటు తెలంగాణ గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, పలువురు రాష్ట్ర మంత్రులు, రాజకీయ నాయకులు కూడా హాజరై నూతన జంటకు అభినందనలు తెలియజేశారు.
టాలీవుడ్ నుంచి పలువురు నిర్మాతలు, నటీనటులు, దర్శకులు ఈ వేడుకకు హాజరుకావడంతో కార్యక్రమం సందడిగా సాగింది. బాలనటుడిగా కెరీర్ ప్రారంభించి జాంబీ రెడ్డి, హను-మాన్, మిరాయ్ వంటి సినిమాలతో ఆకట్టుకున్న తేజ సజ్జా త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెడుతుండటంతో అభిమానులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. డిసెంబర్‌లో వీరి వివాహ వేడుక వైభవంగా జరగనున్నట్లు సమాచారం.
Also Read: 'మైసా' నుంచి 'ఏనాటి వరమో నువ్వు' సాంగ్ రిలీజ్.. ఆకట్టుకుంటున్న రష్మిక లుక్!