మండలంలో జోరందుకున్న నామినేషన్ల పర్వం
- గొట్టివలసలో నామినేషన్ దాఖలు చేసిన బోను సత్యవతి
- ర్యాలీలుగా తరలివచ్చి రిటర్నింగ్ అధికారులకు పత్రాల అందజేత
- పంచాయతీల్లో వేడెక్కిన రాజకీయ వాతావరణం
గరుగుబిల్లి, సూర్య: రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ప్రకారం గరుగుబిల్లి మండలంలో తొలి విడత ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఉత్సాహంగా సాగుతోంది.15 నుండి ప్రారంభమైన నామినేషన్ల స్వీకరణ కార్యక్రమంలో భాగంగా ఆదివారం పలు గ్రామ పంచాయతీల్లో పలువురు సర్పంచ్ అభ్యర్ధులు రిటర్నింగ్ అధికారులకు నామినేషన్ పత్రాలను అందజేశారు. సోమవారం పెద్ద సంఖ్యలో మండలం లోని పలు గ్రామ పంచాయతీల నుంచి సర్పంచ్ అభ్యర్థులు తమ మద్దతు దారులతో తరలివచ్చి రిటర్నింగ్ అధికారులకు నామపత్రాలను సమర్పించారు.గొట్టివలస గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా బోను సత్యవతి ఎంపీటీసీ సభ్యులు వెలమల సంధ్య, బోను సుధ తదితర మద్దతు దారులతో తరలి వచ్చి రిటర్నింగ్ అధికారి చందక శంకర్రావుకు నామినేషన్ పత్రాలను అందజేశారు. గరుగుబిల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా ఎడ్ల శాంతి,ఎడ్ల శ్రీనివాస రావు,నల్ల తిరుపతినాయుడు తదితర మద్దతుదారులతో తరలి వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు.అదే విధంగా పెద్దూరు గ్రామ పంచాయతీ నుండి సర్పంచ్ అభ్యర్థిగా తెర్లి రామలక్ష్మి ఎంపీటీసీ సభ్యులు తెర్లి ఎల్లం నాయుడు,తెర్లి వసంతకుమార్, మర్రాపు శ్రీనివాసరావు తదితరులతో తరలి వెళ్లి రిటర్నింగ్ అధికారికి నామి నేషన్ పత్రాలను అందజేశారు. బురదవెంకటాపురం సర్పంచ్ అభ్యర్థిగా బొత్స జగదీష్ రిటర్నింగ్ అధికారికి తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు.రావివలస సర్పంచ్ అభ్యర్థిగా ఆర్నిపల్లి భారతమ్మ ఆర్నిపల్లి గంగాధరనాయుడు,గుంట్రెడ్డి గౌరునాయుడు,గంట నాగరాజు తదితరులతో తరలివెల్లి నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు.మండల పరిధిలోని ఆయా గ్రామాలకు చెందిన పలువురు సర్పంచ్ అభ్యర్థులుగా నామినేషన్లను దాఖలు చేశారు.