BREAKING
మార్కాపురం జిల్లాలో కరవు నివారణ మరియు సమగ్ర ఉపశమన చర్యలకు పెద్దపీట: జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల కు డ్రోన్ టెక్నాలజీతో నిఘా సెన్సెక్స్ టార్గెట్ 95,000: భారత మార్కెట్లపై మోర్గాన్ స్టాన్లీ బుల్లిష్ అంచనా! స్వాతంత్ర్యోద్యమ స్ఫూర్తితో గ్రంథాలయ ఉద్యమ నిర్మాణం - విశ్రాంత అధికారి పి.వి. మల్లేశ్వర్ అయ్యప్ప స్వాములకు అన్నప్రసాద వితరణ చేసిన రామిరెడ్డి సురేష్ రెడ్డి గజపతినగరంలో భక్తులతో పోటెత్తిన ఉమా రామలింగేశ్వర ఆలయం టిటిడి శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో కళ్యాణం తుఫాను ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు అధికారులు అప్రమత్తంగా ఉండాలి : జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి సమాజంలో పాత్రికేయుల సేవలు వెలకట్టలేనివి .... సంచలనాలు కాదు మీడియాకు సమాజ సేవ ముఖ్యం ఈవీఎం గోదామును సాధారణ తనిఖీల్లో భాగంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి ఆసియా మార్కెట్లకు దీటుగా భారత స్టాక్ మార్కెట్లు: 82 వేలకుపైన సెన్సెక్స్! గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ & కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి చేయాలి :జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్, వి పిల్లల సమస్యల పరిష్కారానికి ‘పిల్లల ప్రజావాణి’ వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరిన JBKపురం మాజీ సర్పంచ్ కంచర్ల తిరుపతయ్య

ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలి.. అధికారులకు ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పి. పుల్లారెడ్డి ఆదేశం

Select Suryaa Now
ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలి.. అధికారులకు ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పి. పుల్లారెడ్డి ఆదేశం

అమరావతి, మేజర్‌న్యూస్‌ :

ఆక్వాన్‌ తుపాను నేపథ్యంలో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలగకుండా, విద్యుత్‌ వ్యవస్థకు నష్టం వాటిల్లకుండా అన్ని ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఏపీసీపీడీసీఎల్ సీఎండీ శ్రీ పి. పుల్లారెడ్డి గారు క్షేత్రస్థాయి అధికారులను ఆదేశించారు. ఏపీసీపీడీసీఎల్ పరిధిలోని విద్యుత్ అధికారులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో తుఫాన్‌ సన్నద్ధత చర్యలపై సమీక్షిస్తూ, ఈ నెల 17, 18 తేదీల్లో విద్యుత్‌ లైన్లకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మల తొలగింపు, వాలిన విద్యుత్‌ స్తంభాల సరిచేత, వదులుగా ఉన్న విద్యుత్‌ వైర్లను బిగించే పనులను తప్పనిసరిగా పూర్తి చేయాలని సూచించారు.
ప్రతి సబ్‌ డివిజన్‌ పరిధిలో కనీసం రెండు లోడ్ల 9.1 మీటర్ల విద్యుత్‌ స్తంభాలు, ఒక లోడ్‌ 8 మీటర్ల విద్యుత్‌ స్తంభాలను సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు. స్థానిక సెక్షన్‌ కాంట్రాక్టర్లు, RDSS కాంట్రాక్టర్ల ద్వారా అవసరమైన సిబ్బందిని సమీకరించి, వారి సంప్రదింపు వివరాలను అందుబాటులో ఉంచుకోవాలన్నారు.
అదేవిధంగా విద్యుత్‌ స్తంభాల ఏర్పాటు, మరమ్మతు పనుల కోసం పోల్‌ డిగ్గర్లు, JCBలు తదితర యంత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలని తెలిపారు. తుఫాన్‌ ప్రభావం పూర్తిగా తగ్గే వరకు విద్యుత్‌ శాఖ సిబ్బందికి సెలవులు మంజూరు చేయరాదని స్పష్టం చేశారు. 
తుఫాన్‌ సమయంలో విద్యుత్‌ అంతరాయాలు ఏర్పడితే తక్షణమే స్పందించి, సాధ్యమైనంత త్వరగా విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించేలా అన్ని అధికారులు, సిబ్బంది పూర్తి అప్రమత్తతతో పనిచేయాలని సీఎండీ పి. పుల్లారెడ్డి గారు ఆదేశించారు.