శివనామస్మరణతో మార్మోగిన శైవక్షేత్రాలు
- శివాలయాలకు కార్తీక శోభ..భక్తజన సందోహం
- హరహర మహాదేవ కిటకిటలాడిన శివాలయాలు
- దీపకాంతులతో వెలిగిపోయిన ఆలయాలు
- కార్తీక పూజలతో ఆధ్యాత్మిక శోభ
గరుగుబిల్లి, సూర్య: పవిత్ర కార్తీక మాసాన్ని పురస్క రించుకుని మండల పరిధిలోని ఆయా గ్రామాల్లోని శివాలయాలు శివనామస్మ రణతో మార్మోగాయి.సోమవారం తెల్ల వారుజాము నుంచే భక్తులు నదులు, చెరువుల్లో పుణ్యస్నానాలు ఆచరించి ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వెళ్లారు. "ఓం నమః శివాయ","హరహర మహా దేవ" అంటూ భక్తులు చేసిన శివనామ స్మరణతో ఆలయ ప్రాంగణాలను మార్మోగాయి.కార్తీక మాసం విశిష్టతను పురస్కరించుకుని ఆలయ అర్చకులు వేకువజాము నుంచే స్వామివారికి పంచామృత అభిషేకాలు, మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు, బిల్వార్చనలు నిర్వహించారు.మహిళ లు ఉసిరి చెట్ల కింద,ఆలయ ధ్వజ స్తంభం వద్ద కార్తీక దీపాలను వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు.సాయంత్రం వేళ ఆలయ ప్రాంగణాలు మట్టి ప్రమిదల దీపకాంతులతో దేదీప్యమా నంగా వెలిగిపోయాయి.భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ కమిటీ సభ్యులు క్యూలైన్లు, తాగునీటి సౌక ర్యం మరియు అన్నదాన కార్యక్రమాల ను నిర్వహించారు.గిజబ గ్రామము లోని శ్రీకాశీవిశ్వేశ్వరస్వామి ఆలయం లో లుంబిసి గ్రామానికి చెందిన కొర్లకుంట సత్యనారాయణ,శివపార్వతి మరియు కుమారులు వేణు, భాను ప్రకాష్ ల ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమమును నిర్వహిం చారు.అన్నప్రసాద వితరణ కార్యక్రమం లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్న ప్రసాదమును స్వీకరించారు.