చెల్లి పెళ్లిలో సందడి చేసిన నజ్రియా నజీమ్.. వైరల్ అవుతున్న ఫొటోలు!
సూర్య ఎంటర్టైన్మెంట్ డెస్క్: నటి నజ్రియా నజీమ్ తన చెల్లి వివాహ వేడుకకు సంబంధించిన అందమైన ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. చెల్లి పెళ్లి అయిన సందర్భంగా ఇన్స్టాగ్రామ్ వేదికగా భావోద్వేగపూరిత పోస్ట్ చేసిన నజ్రియా, తమ చిట్టి చెల్లిని ఎత్తుకుని తిరిగిన జ్ఞాపకాలు ఇంకా కళ్లముందే ఉన్నాయని తెలిపారు. నిన్ననే కలిసి ఆడుకున్నట్లు అనిపిస్తున్నా, అప్పుడే పెళ్లయిపోయిందని పేర్కొంటూ, చెల్లి ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని, ఆమె చిరునవ్వు ఎప్పటికీ అలాగే నిలిచి ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. అలాగే కొత్తగా తమ కుటుంబంలోకి అడుగుపెట్టిన సోహైల్‌కు స్వాగతం పలుకుతూ నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.
నజ్రియా పంచుకున్న ఈ పెళ్లి ఫొటోలపై అభిమానులు, నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. నజ్రియా చెల్లి కూడా ఆమెలాగే ఎంతో ముద్దుగా ఉందంటూ ప్రశంసిస్తూ కామెంట్లు చేస్తున్నారు.
యాంకర్‌గా కెరీర్ ప్రారంభించిన నజ్రియా నజీమ్, 2013లో వచ్చిన మ్యాడ్ డాడ్ చిత్రంతో హీరోయిన్గా తెరంగేట్రం చేశారు. అదే ఏడాది విడుదలైన రాజా రాణి సినిమాతో విశేష గుర్తింపు సంపాదించుకున్నారు. 2022లో నాని సరసన నటించిన అంటే సుందరానికి సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించారు. ఇటీవల సూక్ష్మ దర్శిని చిత్రంతో విజయాన్ని అందుకున్న ఆమె, సూర్య హీరోగా నటించిన సీన్ సినిమాలో మాయ అనే పోలీస్ అధికారి పాత్రలో కనిపించి ఆకట్టుకున్నారు. ప్రస్తుతం పలు ఆసక్తికర ప్రాజెక్టులతో నజ్రియా బిజీగా ఉన్నారు.
Also Read: ఒకేరోజు బాక్సాఫీస్ పోరు.. మమ్ముట్టి 'ఓం' వర్సెస్ దుల్కర్ 'ఆకాశంలో ఒక తార'!