BREAKING
ఎంసీ పల్లి టీడీపీ సర్పంచ్ అభ్యర్థిగా ఎల్. రత్నమ్మ చౌదరి నామినేషన్ దాఖలు.. దేవనకొండ మండలంలో 168 నామినేషన్లు పాలకుర్తిలో రైతు సదస్సు – వ్యవసాయ ప్రదర్శన పారిశుద్ధ్య కార్మికులకు ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో రగ్గుల పంపిణీ బహ్రెయిన్ వైమానిక స్థావరంపై దాడి ప్రచారం నిరాధారం.. నిర్మల్ నుండి అరుణాచలం ప్రత్యేకయాత్ర బస్సు సౌకర్యం . డి ఎం పండరి. : పాలకుర్తిలో పొలం పిలుస్తుంది కార్యక్రమం చందుకు 52వ వార్డు కార్పొరేటర్‌గా అవకాశం.. ఎమ్మెల్యే గురజాలకు షణ్ముగం కుటుంబం కృతజ్ఞతలు. కిష్టాపూర్ లో క్రషర్ ను వెంటనే మూసివేయాలి : హేమ సుదర్శన్ శ్రీ చైతన్య స్కూల్‌లో ఘనంగా ఇంగ్లీష్ గ్రామర్ ఎక్స్‌పో అండమాన్ సాంస్కృతిక వేదికపై మెరిసిన దివిసీమ చిన్నారి శివతాండవ నృత్యంతో సరయుకు రజత పతకం అనారోగ్యంతో మృతి చెందిన హోంగార్డుకు లాలాపేట పోలీసుల ఘన నివాళి కారును ఢీకొన్న బైక్..యువకుడికి గాయాలు సర్పంచ్ అభ్యర్థి అన్నమ్మను ఆదరించండి హొళగుంద సూర్య ప్రతినిధి సర్పంచ్ అభ్యర్థి అన్నమ్మను ఆదరించండి హొళగుంద సూర్య ప్రతినిధి

గ్రంథాలయోద్యమ ప్రముఖులకు నివాళి

Select Suryaa Now
గ్రంథాలయోద్యమ ప్రముఖులకు నివాళి

భట్టిప్రోలు, మేజర్ న్యూస్: మండల కేంద్రమైన భట్టిప్రోలు లోని మాటూరు రామారావు శాఖ గ్రంథాలయంలో 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా మూడవ రోజైన సోమవారం గ్రంథాలయ ఉద్యమంలో పాల్గొన్న ప్రముఖులను స్మరించుకొనుట జరిగినది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎంపీపీ ఎస్. బి ఆర్ పాఠశాల ఉపాధ్యాయులు ఆత్మూరి వెంకట సుబ్బారావు పాల్గొన్నారు. ముందుగా శ్రీ అయ్యంకి వెంకట రమణయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సుబ్బారావు మాట్లాడుతూ గ్రంథాలయ ఉద్యమ ప్రముకులైన శ్రీ ఎస్ ఆర్ రంగనాథన్, శ్రీ అయ్యంగి వెంకట రమణయ్య, శ్రీ పాతూరు నాగభూషణరావు, గ్రంథాలయముకు చేసిన సేవలను కొనియాడారు. విద్యార్థులకు సీనియర్ విభాగంలో గ్రంధాలయ ఉద్యమంలో పాల్గొన్న ప్రముఖులపై వ్యాసరచన, జూనియర్ విభాగంలో నీతి కథ వ్రాయడం పై పోటీలను నిర్వహించారు. ఈ పోటీలలో 65 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శాఖ గ్రంథాలయాధికారి కలపాల సుభాష్ చంద్రబోస్, విద్యార్థులు, పాఠకులు పాల్గొన్నారు.