BREAKING
బీజేవైఎం రంగారెడ్డి జిల్లా అధికార ప్రతినిధిగా ఊటు నరేష్ జిల్లా బీజేవైఎం అధికార ప్రతినిధిగా కళ్ళెం సూర్య ప్రకాష్ చెత్త డంపింగ్ యార్డులో చెలరేగిన మంటలు .... ఎంసీ పల్లి టీడీపీ సర్పంచ్ అభ్యర్థిగా ఎల్. రత్నమ్మ చౌదరి నామినేషన్ దాఖలు.. దేవనకొండ మండలంలో 168 నామినేషన్లు పాలకుర్తిలో రైతు సదస్సు – వ్యవసాయ ప్రదర్శన పారిశుద్ధ్య కార్మికులకు ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో రగ్గుల పంపిణీ బహ్రెయిన్ వైమానిక స్థావరంపై దాడి ప్రచారం నిరాధారం.. నిర్మల్ నుండి అరుణాచలం ప్రత్యేకయాత్ర బస్సు సౌకర్యం . డి ఎం పండరి. : పాలకుర్తిలో పొలం పిలుస్తుంది కార్యక్రమం చందుకు 52వ వార్డు కార్పొరేటర్‌గా అవకాశం.. ఎమ్మెల్యే గురజాలకు షణ్ముగం కుటుంబం కృతజ్ఞతలు. కిష్టాపూర్ లో క్రషర్ ను వెంటనే మూసివేయాలి : హేమ సుదర్శన్ శ్రీ చైతన్య స్కూల్‌లో ఘనంగా ఇంగ్లీష్ గ్రామర్ ఎక్స్‌పో అండమాన్ సాంస్కృతిక వేదికపై మెరిసిన దివిసీమ చిన్నారి శివతాండవ నృత్యంతో సరయుకు రజత పతకం అనారోగ్యంతో మృతి చెందిన హోంగార్డుకు లాలాపేట పోలీసుల ఘన నివాళి

పాలకుర్తిలో పొలం పిలుస్తుంది కార్యక్రమం

Select Suryaa Now
పాలకుర్తిలో పొలం పిలుస్తుంది కార్యక్రమం

 

కోడుమూరు మేజర్ న్యూస్ : కోడుమూరు మండలంలోని పాలకుర్తి గ్రామంలో ఈరోజు పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు గ్రామంలోని రైతులతో కలిసి పంట పొలాలను పరిశీలించి, పంటల సాగు విధానాలు, చీడపీడలు, తెగుళ్ల నివారణ చర్యలపై రైతులకు అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో కర్నూలు ఏడీఏ (సహాయ వ్యవసాయ సంచాలకులు), కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులోని డాట్ సెంటర్ (ఏరువాక కేంద్రం) ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సుజాతమ్మ, మండల వ్యవసాయ అధికారి, పాలకుర్తి రైతు సేవా కేంద్రం సిబ్బంది, గ్రామ రైతులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రబీ సీజన్‌లో జాతీయ ఆహార నూనెగింజల పథకం (VCC) కింద రైతులకు ఉచితంగా అందించిన వేరుశనగ విత్తనాలతో సాగు చేసిన పంటను అధికారులు, శాస్త్రవేత్తలు పరిశీలించారు. పంటలో రసం పీల్చే పురుగు, మొవ్వ కుళ్ళు తెగులు గుర్తించిన నేపథ్యంలో వాటి నివారణకు ఎకరాకు 100 మి.లీ. కార్బెండజిమ్ 250 గ్రాములు పిచికారీ చేయాలని రైతులకు సూచించారు.

అదేవిధంగా వేరుశనగ పంట పూత దశలో ఉన్నప్పుడు ఎకరాకు 200 కిలోల చొప్పున జిప్సం చల్లుకోవాలని తెలిపారు. పోషకాల లోపాలను నివారించేందుకు నానో డీఏపీ లేదా 19:19:19 కాంప్లెక్స్ ఎరువును పిచికారీ చేయాలని సూచించారు.

రైతులు వ్యవసాయ అధికారుల సూచనలు పాటిస్తూ సరైన యాజమాన్య పద్ధతులు అవలంబించినట్లయితే అధిక దిగుబడులు సాధించవచ్చని అధికారులు వివరించారు.