దేవనకొండ మండలంలో 168 నామినేషన్లు
ఈ నెల 26న జరగనున్న సర్పంచ్ ఎన్నికలకు దేవనకొండ మండల వ్యాప్తంగా 26 పంచాయతీ గ్రామాలకు గాను మొత్తం 168 మంది సర్పంచ్ అభ్యర్థులు మరియు 600 మంది వార్డు మెంబర్లకు నామినేషన్ దాఖలు చేశారని యంపీడిఓ జ్యోతి తెలిపారు.మంగళవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ అభ్యర్థుల నామినేషన్ పత్రాలను పరిశీలించి అర్హుల జాబితాను త్వరలోనే ప్రకటిస్తామనని అనంతరం అభ్యర్థులకు గుర్తులను కేటాయిస్తామని పేర్కొన్నారు.