BREAKING
పాఠశాలలో విద్యార్థులకు చిత్రలేఖనం పోటీలు. జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు గాజులరామారంలో ఘనంగా శ్రీశ్రీ కోటి దీపోత్సవం వెంకన్న ఆలయ పున నిర్మాణ పనులు పరిశీలన రుద్రంపేట పంచాయతీ వైఎస్సార్‌సీపీ సర్పంచ్ అభ్యర్థిగా షేక్ మహబూబ్ బీ నామినేషన్ అఫ్గానిస్తాన్‌పై జింబాబ్వే సంచలన విజయం, ఉత్కంఠ పోరులో రెండో టెస్టుతో పాటు సిరీస్ కైవసం జనసేన బలపరిచిన పరింపూడి సర్పంచ్ అభ్యర్థి కోడూరి భారతి --అఖండ మెజారిటీతో గెలిపిద్దాం : ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మాజీ సీఎం నల్లారిని కలిసిన జడ్పిటిసి జబ్బల మీనా : భాజపా నేత జబ్బల శ్రీనివాసులుకు అభినందనలు టెక్నాలజీతో పరీక్షల్లో కొత్త తరహా మోసాలు... నసనకోట టీడీపీ సర్పంచ్ అభ్యర్థిగా చిన్న ముత్యాలప్ప నామినేషన్ దాఖలు.. అర్హులైన తెలంగాణ ఉద్యమ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కల్పించేందుకు కృషి చేస్తా ఎమ్మెల్సీ ప్రొఫెసర్ ఎం. కోదండరాం క్లస్టర్ కేంద్రాలకు ఎన్నికల సామగ్రి పంపిణీ పంట కోత ప్రయోగాలు 24న పుల్లూరుబండపై సామూహిక సత్యనారాయణ వ్రతాలు జీవ వనరుల కేంద్రం సమగ్ర సస్య రక్షణ అవగాహన సమావేశం

ఈనెల19న వెల్దుర్తి ఎంపీపీ ఎన్నిక ...

Select Suryaa Now
ఈనెల19న వెల్దుర్తి ఎంపీపీ ఎన్నిక ...

వెల్దుర్తి మేజర్ న్యూస్: స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఈ నెల 19వ తేదీ (గురువారం) మండల పరిషత్ అధ్యక్ష (ఎంపీపీ), ఉపాధ్యక్ష (వైస్ ఎంపీపీ) ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల అధికారిణి (ఆర్వో) శ్రీదేవి తెలిపారు. మంగళవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎంపీటీసీ సభ్యులుగా గెలుపొంది, ధ్రువీకరణ పత్రాలు అందుకున్న వారందరికీ ఎన్నికలో పాల్గొనాలని నోటీసులు అందించినట్లు చెప్పారు. సభ్యులందరూ విధిగా హాజరుకావాలని కోరారు.గురువారం ఉదయం ముందుగా నూతన ఎంపీటీసీ సభ్యుల ప్రమాణ స్వీకారం, అనంతరం కో-ఆప్షన్ సభ్యుడి ఎంపిక నిర్వహిస్తామని ఆర్వో వివరించారు. ఆ తర్వాత ఎంపీపీ ఎన్నిక ప్రక్రియలో భాగంగా ఎంపీటీసీల నుంచి నామినేషన్లు స్వీకరిస్తామన్నారు. ఒకే నామినేషన్ దాఖలైతే ఎన్నిక ఏకగ్రీవమవుతుందని, పోటీ నెలకొంటే చేతులెత్తే పద్ధతి ద్వారా విజేతను నిర్ణయిస్తామని తెలిపారు. ఒకవేళ సమాన ఓట్లు వస్తే లాటరీ పద్ధతిలో ఎంపిక ఉంటుందన్నారు. ఎంపీపీ ఎన్నిక పూర్తయిన వెంటనే వైస్ ఎంపీపీ ఎన్నిక నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ ఎన్నికకు హాజరుకావాల్సిందిగా ఎంపీటీసీలతో పాటు ఎమ్మెల్యే, ఎంపీలకు ఆహ్వానాలు పంపినట్లు వెల్లడించారు.

తెదేపాదే పైచేయి..

మండలంలో మొత్తం 17 ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. ఇటీవలి ఎన్నికల్లో తెదేపా 11, వైకాపా 5, స్వతంత్ర అభ్యర్థి 1 స్థానంలో విజయం సాధించారు. స్పష్టమైన మెజారిటీ ఉండటంతో వెల్దుర్తి ఎంపీపీ పీఠం తెదేపాకు దక్కడం లాంఛనమే కానుంది.