మాజీ సీఎం నల్లారిని కలిసిన జడ్పిటిసి జబ్బల మీనా : భాజపా నేత జబ్బల శ్రీనివాసులుకు అభినందనలు
మదనపల్లి,మేజర్ న్యూస్ : అన్నమయ్య జిల్లా,పీలేరు నియోజకవర్గం,కలికిరిలో మంగళవారం మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని తంబళ్లపల్లె నియోజకవర్గం,ములకలచెరువు జడ్పిటిసిగా విజయం సాధించిన కూటమి బలపరిచిన బీజేపీ అభ్యర్థిని జబ్బల మీనా తనభర్త సౌత్ ఇండియా ఓబీసీ అధ్యక్షులు,సౌత్ ఇండియా కురుబ,కురుమ,కురుంబన్,కురువన్,దంగర్ సంఘం అధ్యక్షులు జబ్బల శ్రీనివాసులుతోపాటు మర్యాదపూర్వకంగా కలిశారు.ఇందులో భాగంగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని శాలువాతో ఘనంగా సన్మానించారు.ముందుగా జడ్పిటిసి ఎన్నికల్లో అద్భుతం విజయం సాధించిన జబ్బల శ్రీనివాసులు దంపతులకు మాజీ సీఎం శుభాకాంక్షలు తెలిపారు.ప్రజలు ఎంతో నమ్మకంతో ప్రజా ప్రతినిధులుగా ఎన్నుకుంటారని నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషిచేసి వారి నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని సూచించారు.రాష్ట్ర అభివృద్ధికి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం సంపూర్ణ సహకార అందిస్తోందన్నారు.బిజెపి విధానాలను ప్రజలకు విస్తృతంగా తీసుకెళ్లి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు.అనంతరం జబ్బల శ్రీనివాసులు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రిని కలవడం ఆనందంగా ఉందన్నారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ప్రత్యేక ముద్రవేశారని,సమర్థవంతమైన ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నారని కొనియాడారు.ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో ఆయన క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారన్నారు.ఆయన సూచనలు,సలహాలతో ముందుకు సాగుతామని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు పులి నరేంద్ర కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్ : కే.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి