వెంకన్న ఆలయ పున నిర్మాణ పనులు పరిశీలన
నెేటి సూర్య బ్యూరో రాజమహేంద్రవరం పెరవలి మండలం అన్నవరప్పాడు గ్రామంలో గోదావరి పుష్కరాల నిధులతో పునర్నిర్మాణం చేపడుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ పనులను దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు మంగళవారం పరిశీలించారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ కాకినాడ డిప్యూటీ కమిషనర్ డి.ఎల్.వి. రమేష్ బాబు, జిల్లా దేవాదాయ శాఖ అధికారి వి. సత్యనారాయణ ఆలయానికి విచ్చేసి జరుగుతున్న పునర్నిర్మాణ పనులను పరిశీలించారు. అదేవిధంగా త్వరలో ప్రారంభం కానున్న ప్రాకార మండపం నిర్మాణ పనులపై కూడా సమీక్షించారు.ఈ సందర్భంగా నిర్మాణ పనుల నాణ్యత, పురోగతిపై పలు సూచనలు చేసిన అధికారులు, ఆలయ అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేసి నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి మీసాల రాధాకృష్ణ, ఆలయ సిబ్బంది, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు.